సామాన్యుడి నడ్డవిరిచిన నవంబర్‌ 8

బ్లాక్‌డేను విజయవంతం చేయాలి

సిటీ కాంగ్రెస్‌ పిలుపు

కరీంనగర్‌,నవంబర్‌ 7(జ‌నంసాక్షి): దేశంలో నల్లదనాన్ని రూపుమాపుతామని ప్రగల్బాలు పలికిన కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వల్ల నేటికి కూడా కోలుకోలేక ప్రజలు కకావికలంగా మారారని, ఈ చర్యను దేశవ్యాప్తంగా నల్లదినంగా (బ్లాక్‌ డే)గా పాటించా లని కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించినందున అన్నివర్గాల ప్రజలుతమతో కలిసిరావాలని నగర కాంగ్రెస్‌ అద్యక్షుడు కర్రరాజశేఖర్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానికఅర్‌అండ్‌ బివసతి గృహంలోకార్పోరేషన్‌ ప్లోర్‌లీడర్‌ ఆకుల ప్రకాశ్‌, డీసీసీ లీగల్‌ సెల్‌ అద్యక్షుడు ఒంటెల రత్నా కర్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గందెమాదవి, ఎస్సీసెల్‌, బీసీసెల్‌ జిల్లా అద్యక్షులు రవి, మదులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈసందర్బంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీని 8 వతేదీన నిర్వహించి నిరసన తెలుపనున్నామని తెలిపారు. తెలంగాణా చౌక్‌నుంచి ఆర్టీసి బస్‌స్టాండ్‌, వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, మార్కెట్‌లోని వెంకటేశ్వర దేవస్థానం, మున్సిపల్‌ వసతిగృహం, పోస్టా ఫీస్‌, గంజ్‌, రాజు టీస్టాల్‌, విూదుగా రాజీవ్‌ చౌక్‌కు చేరుకుంటుందన్నారు. ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా నల్ల బ్యాడ్జీలు దరించి నల్ల జండా లను చేతబూని పాల్గొంటారన్నారు. రాజీవ్‌ చౌక్‌లో జరిగే జన సవిూకరణలో నేతలు ప్రసంగిస్తారన్నారు. భారత దేశ జీడీపికేంద్రంలో బీజెపి అధికారంలోకి వచ్చేనాటికి 7.5శాతం ఉండగా, నేడు అదికాస్తా 5.4శాతానికి పడిపోయిందన్నారు. ఇది మోడి సాదించిన ఘనతని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో ఉన్న సొత్తంతా కూడా బ్యాంకులకు చేరిపోయిందని, ఎక్కడా రూపాయి నల్ల దనాన్ని నివారించలేక పోయారని మండిపడ్డారు. ఆనాడు మూడునెలల్లో డబ్బులు అందుబాటులో లేకపోవడంతో 154 మంది చనిపోయారని గుర్తుచేశారు. ఆనా టి దుర్దినాన్ని గుర్తుచేసుకుని ఇకముందు దేశంలో ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వానికి కల్లు తెరిపించేందుకు చేపట్టి న బ్లాక్‌ డేను విజయవంతం చేయాలని వ్యాపార, వాణిజ్య, కర్షక, కార్మిక, ఉద్యోగ వర్గాలను కోరారు. ఈ కార్యక్రమంలో నగర, మండల కాంగ్రెస్‌నేతలు అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. ఈసందర్బంగా నగరపాలక సంస్థ ప్లోర్‌ లీడర్‌ ఆకుల ప్రకాశ్‌ మాట్లా డుతూదేశానికి స్వాతంత్య్రం వచ్చినతర్వాత అత్యంత పెద్దదుర్దినం నవంబర్‌ 8వతేదీ అన్నారు. ఈ సందర్బంగా ఏఐసిసి పిలుపు మేరకు జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ప్రజలు వివిద వర్గాలు అత్యదిక సంఖ్యలో పాల్గొని సంఘీబావం తెలపాలన్నారు. మహిళాకాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గందె మాదవి మాట్లాడుతూ అటు నోట్ల రద్దు ఆతర్వాత జీఎస్‌టీ విదానాన్ని తీసుకువచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా బిన్నం చేయడమేకాక, అన్నివర్గాలకు జీవనాన్ని బారంగా మోపిందని మండిపడ్డారు. డీసీసీలీగల్‌ సెల్‌ అద్యక్షుడు ఒంటెల రత్నాక ర్‌ మాట్లాడుతూ నల్లదనాన్ని నిర్మూలిస్తానన్న మోడి ఆతర్వాత దేశంలో ఉన్న 27వేల కోట్లలో కేవలం 16వేల కోట్లు మాత్రమే ఉందని చూపించి ప్రజలను తప్పుదారి పట్టించడమేకాక ఆమొత్తం డిపాజిట్‌ అయిందని చూపి చేతులు దులుపుకున్నాడని మండిపడ్డారు. ఆనాటి నిర్ణయం ప్రభావం నేటికి ఏడాది పూర్తయినా కూడా ప్రజలు కోలుకోలేకుండా పోయారని ఆరోపించారు. ఎఐసిసి పిలుపు మేరకు జరగుతు న్న ఈ నిరసన కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజలు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పోరేటర్లు అజిత్‌ రావు, ఉమాపతి, నాయకులు బాసెట్టికిషన్‌,

అంజన్‌కుమార్‌, రమేశ్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.