సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న అధికార పార్టీలు

 

 

 

టిఆర్‌ఎస్‌,బిజెపిలను ఓడించాలి: సిపిఎం

నిజామాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో కొనసాగుతున్న

జవిూందారీ జాగీర్దారీ విధానానికి వ్యతిరేకంగా వెట్టి చాకిరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పోరాటాలుచేయడం కారణంగానే తెలంగాణ విముక్తి చెందిందని సీపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్‌ 1948 నుండి 51 వరకు జమిందారులు భూస్వాములు గ్రామాల్లో చేసే అరాచకాలను ఎండగడుతూ పేదలకు వారి నుండి విముక్తి కల్పించడం కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని అన్నారు. ఈ పోరాటంలో నాలుగు వేల మంది పోరాట యోధులు నిజాం ప్రభు జవిూందార్లు దాష్టికాలకు బలయ్యారని రమేష్‌ బాబు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షిక సభలో ఆయన మాట్లాడారు ఈ పోరాటాన్ని తప్పుదోవ పట్టించడం కొరకు టిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ బి.జె.పి లు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు గత నిజాం పాలనను తలపించే విధంగా నియంతృత్వ ధోరణితో జమిందారీ ఆలోచన విధానాలను కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో బిజెపి టిఆర్‌ఎస్‌ లను ప్రజలు మట్టి కల్పించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వెంకట్‌ రాములు , నూర్జహాన్‌ గోవర్ధన్‌ తదితరులతోపాటు సంజీవ్‌, భాస్కర్‌ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

 

 

 

——-