సిటిజన్స్‌ అమెండ్మెంట్‌ బిల్‌ ను పార్లమెంట్లో వ్యతిరేకించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు

– ఇక యాక్ట్‌ అమలునూ అడ్డుకోవాలి
– సార్‌.. ఆ భరోసా ఇవ్వండి
– తెలంగాణలో సీఏఏ అమలు చేయమని చెప్పండి
– సీఎం కేసీఆర్‌ నిర్ణయం ప్రకటించాలని ఆశిస్తోన్న ముస్లిం సమాజం
హైదరాబాద్‌,డిసెంబర్‌ 26(జనంసాక్షి):సిటిజన్‌ అమైండ్‌మెంట్‌ యాక్ట్‌ (సీఏఏ)ను పార్లమెంటులో నిర్ద్వందంగా టిఆర్‌ఎస్‌ తోసిపుచ్చింది ఈ బిల్లుకు ఉభయసభల్లో వ్యతిరేకంగా ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆ పార్టీ విప్‌ జారీ చేసింది ఇందుకు తెలంగాణ ముస్లిం సమాజం సీఎం కేసీఆర్‌ కు  కృతజ్ఞతలు తెలిపింది. సమాజాన్ని మతపరంగా విడదీయడానికి వీలు లేదని టిఆర్‌ఎస్‌ తేల్చిచెప్పింది.వ్యతిరేకిస్తున్నట్టు చెప్పిన సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఆ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించాలని ముస్లిం సమాజం కోరుకుంటోంది. మజ్లిస్‌, ముస్లిం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతలతో సమావేశమైన కేసీఆర్‌ సీఏఏను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలిపారని, తన మాటను ఆచరణలోకి తేవాలని తాము కోరుతున్నామని ముస్లిం జేఏసీ నాయకులు కోరుతున్నారు. దేశంలోని ప్రజల మధ్య విఛిన్న భావనను తెచ్చే ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా చర్యలు చేపట్టి గంగాజమునా తెహజీబ్‌ను పరిరక్షించాలని కోరుతున్నారు.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీఏఏకు కొనసాగింపుగా నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ తీసుకురావడం దేశంలోని మైనార్టీలను భయాందోళనలకు గురి చేస్తుందని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌లో తిరుగులేని మెజార్టీ ఉందని నరేంద్రమోడీ ప్రభుత్వం దేశంలోని మైనార్టీ వర్గాలకు రక్షణ లేకుండా చేస్తుందని, దీనిని రాష్ట్రాలు వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేరళ, పశ్చిమబెంగాల్‌ సీఎంలు ఎన్‌పీఆర్‌ అమలును నిలిపివేస్తామని ప్రకటించారని, అదే విధంగా కేసీఆర్‌ ప్రకటించాలని కోరుతున్నారు.సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌పై సీఎం కేసీఆర్‌ తన వైఖరిని ప్రకటించాల్సిన అవసరం ఉందని ముస్లిం జేఏసీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న కేసీఆర్‌, మొత్తం మైనార్టీ వర్గాలను అశాంతికి లోను చేస్తున్న కేంద్రం చర్యలను నిలదీయాలని కోరుతున్నారు. కేసీఆర్‌ మైనార్టీల ప్రక్షపాతి అని, ఆ దిశగా చర్యలు చేపడితే బాగుంటుందని అంటున్నారు. ఈ చట్టాలను మెజార్టీ రాష్ట్రాలు వ్యతిరేకిస్తే కేంద్రం దిగిరాక తప్పదని అన్నారు. ఈ దిశగా సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ విధాన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు