సిటిలో జోరందుకున్న.. 

వినాయక విగ్రహాల తయారీ
– ఎకో ఫ్రెండ్లీ గణపతులకు పెరిగిన క్రేజ్‌
– హాని కలిగించే విగ్రహాల తయారీ వద్దంటున్న పర్యావరణ ప్రేమికులు
–  మట్టి విగ్రహాల ఏర్పాటుకే మొగ్గుచూపుతున్న నగర వాసులు
హైదరాబాద్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : వినాయక చవితి.. ఈ పండుగ వచ్చిందంటే హైదరాబాద్‌ నగరంలో వాడవాడలా గణపతి నామస్మరణలతో మారుమోగుతాయి.. తొమ్మిది నుంచి పదకొండు రోజుల పాటు జరిగే వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా సాగుతాయి.. మరో నెల రోజుల్లో వినాయక చవితి పర్వదినం రానుండటంతో హైదరాబాద్‌ మహానగరంలో గణపయ్య విగ్రహాల తయారీ జోరందుకుంది.. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ తో  చేసే కలర్‌ ఫుల్‌ వినాయకుల కంటే.. పర్యావరణాని హాని చేయని ఎకో ఫ్రెండ్లీ గణెళిష్‌ లకు క్రేజ్‌ పెరిగింది. పెరుగుతున్న నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు మట్టి ప్రతిమల మార్కెట్‌ కు ఏటా డిమాండ్‌ పెరుగుతోంది. హైదరాబాద్‌నగరంలో తయారవుతున్న ఎకో గణెళిష్‌ విగ్రహాలపై స్పెషల్‌ స్టోరీ..హైదరాబాద్‌ లో ఎన్ని పండగలు జరిగినా.. గణెళిష్‌ ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏటా పర్యవరణం విూద పెరుగుతున్న అవగాహనతో మట్టి, ఎకో ఫ్రెండ్లీ గణెళిష్‌ లను పూజించే భక్తులు పెరుగుతున్నారు. ఈ ఏడాది గణెళిష్‌ చతుర్థికి నెల ముందు నుంచే మట్టి విగ్రహాల తయారి జోరందుకుంది. వ్యాపారులు మట్టి వినాయకుల తయరీలో బిజి అయ్యారు. విగ్రహాలకు కావల్సిన అన్ని మెటీరియల్స్‌ తెచ్చి.. ఒక అడుగు నుంచి 15 అడుగుల వరకు విగ్రహాలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో చాలా ఏరియాల్లో మట్టి వినాయకులు ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటున్నాయి. నెల ముందు నుంచే ప్రీ బుక్కింగ్‌ ఆర్డర్స్‌ వస్తున్నట్టు చెబుతున్నారు వ్యాపారులు. మట్టి వినాయకుల తయారీకి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. 10 అడుగుల విగ్రహాన్ని తయారు చేయడానికి వారం టైం పడుతుంది. వెదురు బొంగులకు గణపతి ఆకారం వచ్చేలా వరి గడ్డిని, తాళ్లతో చుట్టి.. ఆ తర్వాత బంక మట్టితో విగ్రహం తయారు చేస్తారు. ఈ మట్టిలో జనపనార, వరిపొట్టును కలుపుతారు. ఆ తర్వాత కలకత్త గంగ మట్టితో ఫినిషింగ్‌ ఇస్తారు. ఇలా చేయడంతో విగ్రహం పగుళ్లు రాకుండా ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. పండుగ మూడు నెలల
ముందు నుంచే మట్టి గణపతుల తయారీ ప్రారంభించినట్లు చెబుతున్నారు. పెరుగుతున్న ముడిసరుకు ధరలు, ట్రాన్స్‌ పోర్ట్‌ చార్జీలతో ధరలు 500 నుంచి సైజ్‌, డిజైన్‌ బట్టి 50వేల వరకు ఉన్నాయి. అలాగే పూర్తిగా హ్యాండ్‌ మేడ్‌ కావడం, ఎంతో శ్రమతో కూడుకున్న పని కావడంతో.. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల ధర కొంచెం ఎక్కువుంటుదని వ్యాపారులు పేర్కొంటున్నారు.. మరోవైపు ఎకో ఫ్రెండ్లీ గణెళిష్‌ లలో కూడా కొత్త వెరైటీలు వస్తున్నాయి. సిటీలో ప్లాట్‌ గణెళిష్‌ ప్రతిమలకు క్రేజ్‌ పెరిగింది. పూల కుండీతో 7ఇంచుల హైట్‌ ఉన్న మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. తొమ్మిది రోజులపాటు పూజ చేసి.. తొట్టిలోనే నిమజ్జనం చేసే విధంగా వీటిని తయారు చేస్తున్నారు. రెండు రోజులకే గణపతి ప్రతిమ కరిగి మొక్కగా మారుతుంది. గత సంవత్సరం  నుంచి ప్లాట్‌ గణపతికి ఆదరణ పెరిగిందని నగర వాసులు పేర్కొంటున్నారు. ఎకో ఫ్రెండ్లీ గణపతులను మట్టితో తయారు చేస్తారు. దాంతో అవి నిమజ్జనం చేసినప్పుడు తేలికగా నీటిలో కలిసిపోతాయి. పర్యావరణానికి కూడా ఎటువంటి హానీ కలగదంటున్నారు పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు