సివిల్ సప్లైస్ హమాలి కార్మికుల పట్ల నిర్లక్షం ఎందుకు

ఏఐటీయూసీ  జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
జిల్లా వ్యాప్తంగా  మూడవ రోజు  సమ్మె*l
అర్ధనగ్న ప్రదర్శన
నిలిచిపోయిన బియ్యం రవాణా
నల్గొండ బ్యూరో, జనం సాక్షి.
సివిల్ సప్లై హమాలి కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం పెరిగిన రేట్ల ఒప్పంద జీవోను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ  సివిల్ సప్లై హామాలిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు , ఏఐటీయూసీ  జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
      శుక్రవారం  ఏఐటియుసి సివిల్ సప్లైస్ కార్పోరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ సమ్మె సందర్భంగా నల్గొండ సివిల్ సప్లై గోడౌన్ ముందు 3వ రోజు సమ్మె లో అర్ధనగ్న ప్రదర్శన చేయటం జరిగింది, ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి  పాల్గొని మాట్లాడుతూ సివిల్ సప్లై కార్పొరేషన్ కార్మికుల వేతన ఒప్పందం డిసెంబర్ 2021 తో ముగిసిన జనవరి ఒకటో తేదీ నుండి నూతన ఒప్పందం అమల్లోకి రావలసి ఉన్న నేటికీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన అన్నారు. యూనియన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ పైన ఒత్తిడి చేసిన సందర్భంలో గత ఆగస్టు నెలలో రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో చర్చలు జరిగి ఒప్పందం కుదిరింది. కుదిరినటువంటి ఒప్పందం జీవో రూపంలో రావలసిన 4 నెలలుగా జీవో ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేయడానికి నివసిస్తూ  మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రారంభమైన అధికారులు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఒప్పుకున్న ప్రకారం జీవో విడుదల చేసి  సమ్మె విరమింప చేయాలని కోరారు. కరోనా సమయంలో ప్రాణాలుపణంగా పెట్టి బియ్యం సరఫరా చేసిన ప్రభుత్వం జీవో విడుదల చేయడంలో అన్యాయం చేస్తుందని ఆరోపించారు. నిత్యవసర సరుకులు ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్టే హమాలీల రేట్లు పెంచకుండా తాత్సారం చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. హామాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు సమ్మే నిరవధికంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
 ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి సివిల్ సప్లై హమాలి  యూనియన్ జిల్లా కార్యదర్శి దొనకొండ వెంకటేశ్వర్లు , ఏ ఐ ఎఫ్ ఎస్  జిల్లా అద్యక్షులు వలమల్ల ఆంజనేయులు,పందిరి బుచ్చయ్య, లింగస్వామి,బొడ్డు వెంకన్న,ఎల్లయ్య,à జనయ్యా,గిరి వెంకటేశ్వర్లు,  నరేష్, శ్రీను,లింగాస్వామి, సైదులు,యాదయ్య తదితరులు పాల్గొన్నారు.