సెంట్రల్‌ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,మే24(జ‌నంసాక్షి): సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్తాపూర్‌ బ్రాంచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలతో దట్టమైన పొగలు వచ్చాయి. పొగను గమనించిన పలువురు స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రెండు ్గªరిరజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. అయితే, నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.