సేంద్రియ ఎరువులతో చీడపీడలు దూరం

నిజామాబాద్‌,ఆగస్టు13(జ‌నం సాక్షి): రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితీ చీడపీడల బాధ కూడా ఉండదని వ్యవసాయాధికారులు అన్నారు.ఎప్పటికైనా సేంద్రీయ ఎరువులే మేలన్నారు. రైతు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. రైతులకు సేంద్రియ ఎరువుల తయారీ విధానంపై అవగాహన కల్పించారు. పంట సాగులో రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకొని సేంద్రియ ఎరువులను సొంతంగా తయారు చేసుకోవాలన్నారు. సేంద్రియ ఎరువులతో భూ మిలో అన్ని రకాల పోషకాల ఉత్పత్తి జరిగి పంట దిగుబడి పెరుగుతుందని చెప్పారు.