సైనిక నియామకాల కేసు సీబీఐకి అప్పగింత

న్యూఢిల్లీ 14 మార్చి (జనంసాక్షి) :

సైనిక నియామకాల్లో అవకతవక లపై దర్యాప్తును సీబీఐకి అప్పగించ నున్నట్లు సైన్యం వెల్లడిం చింది. పంజాబ్‌లోని కపూర్తలా జిల్లాలోని ఓ సైనిక కేంద్రంలో అభ్య ర్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతు న్నట్లు సైన్యం అంతర్గత నిఘాలో బయట పడింది. కాగా దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సింది గా సీబీఐని సైన్యం కోరనున్నట్లు సమాచారం. ఓ జూనియర్‌ స్థాయి అధికారి ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు ఫిర్యాదులు వచ్చా యని ఉన్నతా ధికారులు పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో ఎవరినీ వది లేది లేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె స్పష్టం చేశారు. అలాంట ివారికిపింఛనుకూడాఇవ్వకుండాసాగనంపుతామని హెచ్చరించారు.