*సైబర్ నేరాలపైన, సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి*

 జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
      గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని ఉదయాదిత్య భవనం లో ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరియు విద్యా శాఖ వారి అధ్వర్యంలో నిర్వహించిన కార్య్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా  యస్.పి రెమా రాజేశ్వరి  ఐ.పి.యస్ గారూ హాజరయి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 10 నెలల నుండి  జిల్లాలోని 52 పాఠశాలల నుండి 104 మంది సైబర్ అంబాజిటర్ గా విద్యార్ధులను, 52 మంది ఉపాద్యాయులను మెంటర్స్ గా  ఎంపిక చేసి వారికి ఆన్లైన్ క్లాస్ ల ద్వారా  ఉమన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్ వారు నౌపుణ్యం కల సైబర్ శిక్షకుల ద్వారా  సైబర్ నేరాల పై వాటి వల్ల కలిగే నష్టాలు వాటిని ఎలా ఎదుర్కోవాలి  తమ తోటి వారికి సైబర్ నేరాల పట్ల అవగాహన వాటి  వల్ల కలిగే నష్టాలు వివరించే విదంగా శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు.  ఈ శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మేమొంటోలు అందేజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా  రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు  పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు పటిష్టమైన నిఘా  షి టీమ్స్ ఏర్పాటు ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని, విద్యార్థునులకు  ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని,ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు  తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ,నోడల్ ఆఫీసర్  అడిషనల్ ఎస్పీ ఆశ్వాక్, డి.ఈ.ఓ బిక్షపతి, షి టీమ్ ఇంచార్జీ సి. ఐ రాజశేఖర్ గౌడ్, సైబర్ క్రైమ్ యస్. ఐ నాగరాజు, జెండర్ కోఆర్డినేటర్ సరిత, పూజ యంగిస్తాన్ ఎన్ జి ఓ వెంకట్, బరోసా సెంటర్ సిబ్బంది, కళా బృందం, పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థులు,సిబ్బంది,పాల్గొన్నారు.