సౌరభ్‌ చౌదరి సంచలనం

షూటింగ్‌లో బంగారు పతకం కైవసం
చాంగ్వోన్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): భారత్‌కు చెందిన 16 ఏళ్ల యువ సంచలన షూటర్‌ సౌరభ్‌ చౌదరి మరోసారి తన సత్తా చాటాడు. తాజాగా దక్షిణ కొరియాలోని చాంగ్వోన్‌లో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీల్లో జూనియర్స్‌ విభాగంలో పాల్గొన్న సౌరభ్‌ పసిడి పతకాన్ని ముద్దాడాడు. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో సౌరభ్‌ చౌదరి స్వర్ణ పతకం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్స్‌ విభాగంలో పురుషుల 10విూటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో పోటీ నిర్వహించారు. ఇందులో భారత్‌కు చెందిన సౌరభ్‌ చౌదరి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 245.5 పాయింట్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. ఇదే ఈవెంట్లో మరో భారత ఆటగాడు అర్జున్‌ సింగ్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. కొరియాకు చెందిన ¬జిన్‌ లిమ్‌ రజతం సాధించాడు. ప్రస్తుతం 11వ తరగతి చదువుతోన్న సౌరభ్‌ మూడేళ్ల క్రితమే షూటింగ్‌ కోసం గన్‌ పట్టాడు.