స్కాలర్స్ నీట్ అకాడమీ కరపత్రం విడుదల చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 16 (జనంసాక్షి)జహీరాబాద్ క్రిస్టియన్ కాలని వాస్తవ్యుడు డాక్టర్ సుమన్ కుమార్ హైదరాబాదులో స్థాపించిన స్కాలర్స్ అకాడమీ యొక్క కరపత్రాలను మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ మన స్థానికుడైన సుమన్ కుమార్ హైదరాబాద్ అశోక్ నగర్ ముషీరాబాద్ లో ఎంబిబిఎస్ ఎంట్రన్స్ నీట్ కోచింగ్ అకాడమీ ప్రారంభించడం అభినందించ దగ్గ విషయమని, మన జహీరాబాద్ విద్యార్థులు ఎంబిబిఎస్ నీట్ ఎంట్రెన్స్ తీసుకోవాలి అనుకునే వారు మన స్థానికుడైన డాక్టర్ సుమన్ కుమార్ స్థాపించిన స్కాలర్స్ నీట్ అకాడమీలో కోచింగ్ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ లో జాతీయస్థాయి రెండవ ర్యాంకు సాధించిన డాక్టర్ సుమన్ కుమార్ ను అభినందించారు. డాక్టర్ సుమన్ కుమార్ మాట్లాడుతూ నీట్ ఎంట్రెన్స్ రాసే విద్యార్థులకు తాము స్కాలర్స్ నీట్ అకాడమీ ప్రారంభించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తమ వద్ద అపారమైన అనుభవం కలిగిన ఫ్యాకల్టీ ఉన్నారని వారు తమ సబ్జెక్ట్ బోధనపై 20 నుండి 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ ఉన్నారని, వారు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిపెట్టి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు బాల బాలికలకు వేరు వేరు హాస్టల్ సౌకర్యం కూడా కల్పించాము కావున నీట్ ఎంట్రెన్స్ కోచింగ్ పొందాలనుకునే విద్యార్థులు తమ అకాడమీ లో ప్రవేశించి నాణ్యమైన విద్యను అభ్యసించి నీట్ ఎంట్రెన్స్ లో మంచి ర్యాంక్ సాధించాలని అన్నారు. పూర్తి వివరాలకు 9030763240,9030663240 ఫోన్ నంబర్లను సంప్రదించాలని అన్నారు. ఈకార్యక్రమంలో స్కాలర్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సుమన్ కుమార్, డైరెక్టర్ డాక్టర్ నరసింహారావు, తెరాస పట్టణ ఉపాధ్యక్షుడు జలిగేరి జయరాజ్, జుంజుర్ సురేష్, నవీన్ కుమార్ పాల్గొన్నారు..