స్కూళ్లలో బోధనోపాధ్యాయులు ఏరీ? 

చాలా పాఠశాలల్లో నిపుణుల కొరత
హైదరాబాద్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వం విద్యారంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుని ముందుకు
నడిపిస్తున్నా , ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేక  గ్రావిూణ ప్రాంతాల్లోని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల  ఒక్క ఉపాధ్యాయుడిని కూడ ఇవ్వడంలేదు. 5 తరగతులకు చెందిన విద్యార్థులను కూర్చోబెట్టి ఒకే చోట విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు సరైన ఉపాధ్యాయులు లేక తమ చదువులను అంతంత మాత్రమే కొనసాగిస్తున్నారన్నారు. చాలాచోట్ల విద్యా వలింటీర్లే విద్యార్థులకు విద్యా బోధనలు చేస్తున్నారు.  పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఆదేశాలకు బిన్నంగా పాఠశాలల తీరు కలవర పరుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న దాన్ని ఆచరణలో మాత్రం పాటించలేకపోతున్నారు. అందుకు విద్యార్థులకు నిత్యనూతనంగా ఇబ్బందులు దర్శనమిస్తునే ఉన్నాయి. కనీస సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలల్లో కనీసం విద్యార్థులకు బోధించేందుకు బ్లాక్‌ బోర్డు లేదు. చాక్‌పీసులు, తాగేందుకు మంచినీరు లేదు. దాంతో విద్యార్థులకు ఇంటి నుండి తాగునీరు వెంట
తెచ్చుకుని తాగుతుంటారు. పాఠశాలలో మరుగుదోడ్లు ఉన్నా అపరిశుభ్రంగా ఉంటున్నాయి. అవి కూడా మరుగుదోడ్లు ఉన్నా అవి వాడుకంలో లేవు.జి/-లలాలో చాలాచోట్ల ఇవే సమస్యలుఉన్నాయి. బీఎడ్‌, డీఎడ్‌ చేసిన నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే
డీఎస్సీని ప్రకటించాలని కోరారు.