స్టింగ్‌ ఆపరేషన్‌ వివరాలు కోరిన చట్టసభ సభ్యులు

వాషింగ్టన్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  అమెరికాలోని నకిలీ విశ్వవిద్యాలయ వ్యవహారంలో యూఎస్‌ ¬ంలాండ్‌ సెక్యూరిటీ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌ తాలూకు పూర్తి వివరాల వెల్లడించాలని ఆ దేశ చట్ట సభ్యులు డిమాండ్‌ చేశారు. భారతీయ అమెరికన్‌ రాజా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రిపబ్లిక్‌, డెమోక్రట్ల బృందం ఈ మేరకు ¬ంలాండ్‌ సెక్యూరిటీ విభాగం, యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) విభాగాలకు లేఖ రాసింది. నిర్బంధంలో ఉన్న విద్యార్థుల విచారణ సరైన రీతిలో జరుగుతుందా లేదా అనే విషయాన్ని వాకబు చేసిన చట్ట సభ్యులు.. న్యాయపరంగా దక్కాల్సి అన్ని హక్కులు వారికి కల్పిస్తున్నారా లేదా అన్నదానిపై వివరాలు కోరారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు సహా తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. నకిలీ విశ్వవిద్యాలయం పేరుతో 130 మంది విదేశీ విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమ వీసాలు ఇప్పించారన్న ఆరోపణలపై అమెరికన్‌ ¬ంలాండ్‌ సెక్యూరిటీ విభాగం 8 మంది భారతీయ విద్యార్థులను అరెస్టు చేసింది.  పే అండ్‌ స్టే రాకెట్‌ గుట్టు రట్టు చేసేందుకు భాగంగా డెట్రాయిట్‌లో ఫార్మింగ్టన్‌ విశ్వవిద్యాలయం పేరుతో  ¬ంలాండ్‌ సెక్యూరిటీ విభాగమే ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసింది. ఈ అంశంలో వారు దోషులుగా తేలితే గరిష్ఠంగా ఐదేళ్లు శిక్ష పడనుంది. దీంతో ఇప్పటికే తెలుగు సంఘాలు అక్కడి విద్యార్థులకు  అండగా అక్కడ న్యాయ సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి.