స్త్రీశిశు సంక్షేమానికి పెద్దపీట: మంత్రి మహేందర్‌ రెడ్డి

వికారాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): రాష్ట్రంలో మహిళ, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్ల నిధులు విడుదల చేయడంతో పాటు,అనేక పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి స్పష్టం చేశారు. తాండూరు మండల పరిషత్‌లో వికారాబాద్‌ జిల్లా స్థాయి ఇంటింటికి అంగన్‌ వాడీ కార్యక్రమాన్ని మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. అంగన్‌ వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు అన్ని గ్రామాల్లో ఇంటింటికి అంగన్‌వాడి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ప్రతి ఇంట్లో ఉన్న 5 ఏండ్ల లోపు పిల్లల వివరాలను తీసుకొని వారి ఆరోగ్య సమస్యల విూద అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలో 36 వేల మంది పిల్లల సర్వేతో పాటు గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మంత్రివెంట స్తానిక నేతలు,అధికారులు ఉన్నారు.