స్వచ్ఛతలో ఎపి ముందుండాలి

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతలో పాల్గొనాలి: మంత్రి

విజయవాడ,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ప్రజారోగ్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని…అనారోగ్యం ప్రబలితే అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి పేర్ని నాని అభిప్రాయ పడ్డారు. పరిశుభ్రత ప్రజా జీవనంలో భాగం కావాలన్న ఆయన అంటువ్యాథులపై అందరిలో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. సమస్య వచ్చినప్పుడే స్పందన సరికాదని, సమస్య రాకముందే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. సత్వరం స్పందించేలా దిగువస్థాయి సిబ్బందిని గైడ్‌ చేయాలన్న మంత్రి స్వచ్ఛభారత్‌కు ఆంధ్రప్రదేశ్‌ నాంది కావాలని అధికారులకు తెలిపారు. గ్రామాలు, వార్డులలో పారిశుధ్యం మెరుగుపరచాలి, ప్రజల జీవనశైలిలో మార్పు తీసుకుని రావాలన్నారు. వ్యాధి నిరోధక చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న ఆయన సకాలంలో సమాచారం ఇవ్వాలని అన్నారు. ప్రజారోగ్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని పరిశుభ్రత ప్రజా జీవనంలో భాగం కావాలని అన్నారు. అంటువ్యాధులపై అందరిలో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. వ్యాధి నిరోధక చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. గ్రామాలలో, వార్డులలో పారిశుధ్యం మెరుగుపరచాలని చెప్పారు. ప్రజల జీవనశైలిలో మార్పు తీసుకురావాలన్నారు. అన్ని పాఠశాలల్లో పరిశుభ్రత బాధ్యత సెర్ఫ్‌ తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రతలో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల మధ్య, ప్రజల మధ్య పరస్పర సహకారం ఉండాలని తెలిపారు. అన్ని పాఠశాశాలల్లో పరిశుభ్రత బాధ్యత సెర్ఫ్‌ తీసుకోవాలని,పరిసరాల పరిశుభ్రతలో మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని సూచించారు. పంచాయితీ రాజ్‌, గ్రావిూణ నీటిసరఫరా శాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. సత్వరం స్పందించేలా దిగువ స్థాయి సిబ్బందిని గైడ్‌ చేయాలని తెలిపారు.