స్వాతంత్ర్య వజ్రోత్సవ ర్యాలీలో పాల్గొన్న రజక సంఘం నాయకులు

ఖమ్మం ఆగస్థు 13. భారత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు (75 సంవత్సరాల సంబరాల వేడుకల) సందర్భంగా ఖమ్మంలో శనివారం అధికారికంగా ఏర్పాటు చేసిన మహా ర్యాలీలో మరియు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాల్గొని దేశభక్తిని చాటారు. త్రివర్ణ పతాకాలు చేతభూని, రజక సంఘం బ్యానర్ లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. “భోలో స్వతంత్ర భారత్ కు జై” భారత్ మాతా కి జై అని నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్, డీసీఎంఎస్ డైరెక్టర్, రజక సంఘం సీనియర్ నాయకులు జక్కుల లక్ష్మయ్య మాట్లాడుతూ రజక సంఘం నాయకులు సేవాభావంతో పాటు దేశభక్తిని పెంపొందించుకుంటు ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు జక్కుల వెంకటరమణ, గొట్టేపర్తి శ్రీనివాస్, త్రీ టౌన్ అధ్యక్షులు గడ్డం ఉపేందర్, రేగుముడి రామకృష్ణ, ప్రముఖ న్యాయవాది కొక్కిరేణి కనకదుర్గ, మాచర్ల యాలాద్రి, మంకెన నాగరాజు,అక్కిపెళ్లి మురళి, అక్కిపెళ్లి బంగారయ్య, పంతంగి వెంకన్న, రేగుముడి హరికృష్ణ, నాగారపు సతీష్, లింగంపల్లి సైదులు, రేగళ్ల లక్ష్మణరావు, పావురాల ఉపేందర్, గోకినపల్లి లాలయ్య, తదితరులు పాల్గొన్నారు.