హమాలి,మెాటార్ కార్మికులకు సమగ్రచట్టం చేయాలి. * ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి యం.డి రాసుద్దీన్.

 

టేకులపల్లి, డిసెంబర్ 8( జనం సాక్షి): హమాలి మోటార్ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి ఎండి రాజుద్దీన్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎల్ విశ్వనాథంలు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఐ ఎఫ్ టి యు మండల మహాసభ నెల్లూరు నాగేశ్వరరావు, బోడ మంచియా అధ్యక్షతన జరిగింది. ఈ సభలో వారు మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు వర్తింప చేసేలా మెరుగైన 11వ వేతన ఒప్పందం చేయాలని, ఒప్పందాన్ని చేయకుండా చర్చల పేరుతో యాజమాన్యాలు,ప్రభుత్వం, జేబీసీసీఐ సంఘాలు కాలయాపన చేస్తున్నారని, డి.పి గైడ్ లైన్స్ తో సంబంధం లేకుండా,అధికారుల జీతాలతో ముడి పెట్టకుండా 50 శాతం వేతనాలు,సౌకర్యాలు పెంచి వెంటనే వేతన ఒప్పందం చేయాలని వారు డిమాండ్ చేశారు. టేకులపల్లి మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, ఈ మండలంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మిక సమస్యలపై ఐ ఎఫ్ టి యు అనేక పోరాటాలు చేసిందని హమాలి, మెాటార్,సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసిందని వారు అన్నారు.
మోడి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను మార్చి 4 కోడ్ లుగా చేసిందని కార్పొరేట్,పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకునేందుకు మోడి ప్రభుత్వం చట్టాలను మార్చిoదని విమర్శించారు. ప్రజల దనం తో ఏర్పాటు చేసిన పరిశ్రమలు,సంస్థలను కాపాడుకునేందుకు అధికారంలోకి వచ్చిన ఆర్ఎస్ఎస్, బిజెపి పాలకులు ప్రజల ఆస్తులను అమ్మి వేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షలాది మంది కార్మికులను మోసం చేశాడని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయించాలన