హరితభవనాలపై 25 నుంచి సదస్సు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌13 (జనంసాక్షి): హరితభవనాలపై ఈ నెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ఇండియన్‌ గ్రీన్‌బిల్డింగ్‌ కాంగ్రెస్‌  ఓ ప్రకటనలో తెలిపింది. హరితగృహాలు, హరితస్కూళ్లు, నెట్‌ జీరో బిల్డింగులు, సుందరమైన హరితనగరాలు, వాణిజ్య భవనాలు, హరిత¬టళ్లు తదితర అంశాలపై ఈ సదస్సులో అంతర్జాతీయ నిపుణులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను వెల్లడించడంతోపాటు ఇప్పటికే ఈ విభాగంలో అనుసరిస్తున్న ఉత్తమ ప్రమాణాల గురించి వివరిస్తారు. ఈ సదస్సు సందర్భంగా హరిత వస్తువులపై ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను నిర్వహించడంతోపాటు ప్రత్యేక అవార్డులను అందజేయనున్నట్టు సీఐఐ-ఐజీబీసీ తెలిపింది. మనదేశంలో ప్రస్తుతం 700 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో హరిత భవనాలు, హరిత సూత్రాలకు అనుగుణమైన 5,400 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.