హరితహారంలో భాగస్వాములు కావాలి

మెదక్‌,జూన్‌19(జ‌నం సాక్షి): తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, యువకులు భాగస్వాములై విరివిరిగా మొక్కలు నాటాలని అటవీ అధికారులు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మ¬ద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున టేక్మాల్‌ మొక్కలు నాటేందుకు సన్నహాలు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తమ మండలానికి కేటాయించిన 7.20 లక్షలు మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ ప్రాంతం వరకు కార్యక్రమంలో అధికారులు కూడా పాల్గొనాలని అన్నారు.