హరితహారంలో మోడల్‌ గ్రామాలను తయారు చేయాలి: కలెక్టర్‌


నిజామాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): హరితహారంలో ప్రతీ మండలంలో ఒక మోడల్‌ గ్రామాన్ని తయారు చేయాలని కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. పూర్తిస్థాయిలో ఇక్కడ మొక్కలు నాటి అవి ఎదిగేలా చేయాలన్నారు. అప్పుడు గ్రామస్థులకు కూడా వాటిపై శ్రద్ద కలుగుతుందని అన్నారు. అదే విధంగా ప్రతీ కాలేజీలో మొక్కలు నాటాలని ఆదేశించారు. హరితహారంలో ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీలలో తక్కువ మొక్కలు నాటడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని, లేనిఎడల చర్యలు తప్పవని హెచ్చరించారు. మొక్కలు చనిపోయిన చోట మళ్లీ నాటాలన్నారు. నాటిన మొక్కలకు ప్రతీరోజు నీరు పట్టించాలన్నారు. తాగునీటి వసతి లేని చోట వెంటనే మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు హరితహారం మొక్కలు, వైద్య శిబిరాలను తనిఖీ చేయాలన్నారు.