హరితహారం నిరంతర కార్యక్రమం: డిప్యూటీ స్పీకర్‌

మెదక్‌,జూలై21(జ‌నం సాక్షి): రాష్ట్రం హరితహారం కావాలనేది అందరి నినాదమని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో మొక్కలు నాటాలన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికే హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా కోటి 60 లక్షల మొక్కలు నాటడమేలక్ష్యమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. మొక్కల పరిరక్షణ కోసం గ్రామగ్రామాన హరిత పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వారంలో ఒకరోజు గ్రీన్‌డే ప్రకటించుకుని మొక్కల సంరక్షణను చూసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. అందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి నీళ్లు పోయాలన్నారు. అడవుల్లో చెట్లు లేక కోతులు గ్రామాలకు తరలి వచ్చాయన్నారు. అడవి విస్తరణ పెంచి కోతులు తిరిగి అడవికి పోయేలా అందరూ చెట్లను పెంచాలన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో, పొలాల గట్లలో మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు.