హాట్‌ సీటుగా మారిన దుబ్బాక ఉప ఎన్నిక

పోటాపోటీగా ముగిసిన ప్రచారం

గెలుపుపై ఎవరికి వారే ధీమా

నేటి ఎన్నికలో తీర్పు ఇవ్వనున్న ప్రజలు

సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న పార్టీలు ¬రా¬రీగా ప్రచారం చేపట్టాయి. నేటి ఉప ఎన్నిక పోలింగ్‌లో ప్రజలు ఎవరిని ఆదరిస్తారన్నది 10న కౌంటింగ్‌లో తేలనుంది. అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేసిననేతలు, తరవాత ఇంటింటి ప్రచారంలో కలుసుకుని ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేశారు. అధికార పార్టీకి ధీటుగా బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారం నిర్వహించాయి. ఇంతకాలం ప్రచారంలో పాల్గొన్న నేతలు ఆదివారం సాయంత్రం దుబ్బాకను వీడారు. ఇక లోకల్‌ నేతలు ఇంటింటి ప్రచారంలో ఆది,సోమవారాల్లో బాగా దూసుకుని పోయారు.

కాంగ్రెస్‌ ప్రచారంలో స్పీడు పెంచి, ప్రజల్లోకి దూసుకుని వెళ్లే యత్నం చేసింది. గ్రామగ్రామాన ఇన్‌ఛార్జీలు పనిచేసారు. టిఆర్‌ఎస్‌ పాలన వైఫల్యాలపైనే ప్రధానంగా అస్త్రాలను సంధిస్తున్నారు. అలాగే దివంగత ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ఛరిష్మాపై బాగా ఆధారపడింది. ఆయన పేరుతోనే ప్రచారంలో ముందుకు సాగారు. అధికార పార్టీ రామలింగారెడ్డి సెంటిమెంట్‌తో ప్రాచరం చేస్తుంటే…కాంగ్రెస్‌ పార్టీ ముత్యం రెడ్డికమిట్‌మెంట్‌ను తెరపైకి తెచ్చి ప్రచారం చేసింది. ఇద్దరు నేతలకు ప్రజల్లో ఆదరణ ఉండమే ఇందుకు ప్రధానకారణంగా భావించాలి. ఇకపోతే కేంద్రం అందించే సాయం, కెసిఆర్‌ అసమర్థ పాలన అంటూ బిజెపి హడావిడి చేసింది. పార్టీ నేతలంతా ఇక్కడే మకాం వేసి ప్రచారంలోకి దూకారు. ఇకపోతే టిఆర్‌ఎస్‌ తరఫున హరీష్‌ రావు పూర్తిస్థాయి ప్రచార కర్తగా పనిచేశారు. ఇరు పార్టీలను దులిపారు. ఇకపోతే ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస రెడ్డి ప్రజలకు బాగా సుపరిచితుడు కావడంతో కాంగ్రెస్‌కు కలసి వచ్చే అంశగా మారింది. అలాగే రఘునందన్‌ రావు కూడా ఇక్కడే మకాం వేసిన వ్యక్తిగా ప్రజలకు తెలుసు. ఆయన కూడా ప్రచారంలో దూసుకుని పోయారు. అధికార టిఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు ఇరు పార్టీల నేతలు తమ విమర్శలతో యత్నించారు. మూడు పార్టీలు దుబ్బాక ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాయి. ఎన్నికను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలోలాగా కాకుండా దుబ్బాక ఎన్నికకు మాత్రం క్షేత్రస్థాయిలో రంగం సిద్దం చేసుకుంది. అధికార టిఆర్‌ఎస్‌ను ఢీకొనడం అంత ఈజీ కాదు. అయినా ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దాని కంటే ప్రయత్న లోపం లేకుండా చూసుకున్నారు. అభ్యర్థి

బలమైన వాడైతే అధికార పార్టీతో గట్టిగానే పొట్లాడవచ్చని లెక్కలు వేసిన కాంగ్రెస్‌, బిజెపిలు తమ అభ్యర్థులగా శ్రీనివాసరెడ్డి, రఘునందన్‌ రావులను బరిలోకి దింపారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్‌ రెడ్డికి కాంగ్రెస్‌ గాలం వేసింది. అక్కడి నుండి కాంగ్రెస్‌ ఉప ఎన్నికలకు ప్లాన్‌ సిద్ధం చేసుకుంది. ఈ విషయంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంత్రాంగం ఫలించింది. ముత్యంరెడ్డికి ఉన్న ఇమేజ్‌ ను క్యాష్‌ చేసుకోవడానికి శ్రీనివాస్‌ రెడ్డిని బరిలో నిలిపితే పోటీ బలంగా ఉంటుందని భావించి, అందుకు అనుగుణంగా పావులు కదిపి సక్సెస్‌ అయ్యారు. అప్పటి వరకు ఎన్నికలపై పెద్దగా ఆశలు లేని కాంగ్రెస్‌లో చిన్న ఆశ మాత్రం కలిగింది.. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ కంటే వెనక పడిపోతే … భవిష్యత్‌కి కష్టమని భయపడింది. కానీ ముత్యంరెడ్డి ఇంటి నుండి అభ్యర్థి అవ్వడంతో టీఆర్‌ఎస్‌కి గట్టి పోటీని ఇచ్చామని ధీమాకు వచ్చింది. అభ్యర్థి ఎంపిక తరవాత… ప్రచారం పై కూడా సీనియర్‌ నాయకులంతా కసరత్తు చేశారు. గ్రామానికి ఓ నాయకుడు .. మండలానికి నలుగురు సీనియర్లకు బాధ్యతలు ఆప్పగించింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూడా దుబ్బాక మండలం బాధ్యతలు స్వయంగా పర్యవేక్షించారు. రేవంత్‌ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.. దామోదర రాజనర్సింహ… షబ్బీర్‌ అలీ, సీఎల్పీ నేత భట్టి,శ్రీధర్‌ బాబు తదితరులు ఇంఛార్జీలుగా బాధ్యతలు తీసుకుని కార్యక్షేత్రంలోకి దిగారు. గ్రామం యూనిట్‌గా నాయకులను రంగంలోకి దించింది. ఎక్కడి వారు అక్కడే ఉండటం… ప్రభుత్వం వైఫల్యాలు… ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులు చెప్పడం అజెండాగా పెట్టుకున్నారు. అదే అజెండాను పక్కకు పోనీయకుండా, టిఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎత్తుకుని ప్రచారం చేసారు. అందుకే దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ … ప్రభుత్వ వైఫల్యం… చెరుకు ముత్యంరెడ్డి ఓటు బ్యాంకుని నమ్ముకుంది. బీజేపీని కట్టడి చేయడం లక్ష్యంగా హరీష్‌ రావు ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ నాయకుల పర్యటనతో నియోజకవర్గ క్యాడర్‌లో కొంత ఆత్మస్థైర్యం పెరిగింది. గతంలో కంటే మెరుగైన ఫలితం వస్తుందనే ధీమా పార్టీలో కనిపిస్తోంది. ఇప్పుడు ఫలితం ఎలా ఉన్నా… భవిష్యత్‌ మాత్రం మనదే అనే ధీమాతో ఉంది. అందుకే ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి… సెంటిమెంట్‌ని తెర విూదకు తెచ్చింది. ఇది కొంత పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు నేతలు. అభివృద్ది సిద్దిపేట, గజ్వెల్‌లకే పరిమితంకావాలా…దుబ్బాకకు అవకాశం వద్దా అన్న సెంటిమెంట్‌ తో పాటు కెసిఆర్‌ కుటుంబ పాలనను బిజెపి ప్రధాన అంశంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లింది. ఛాలెంజ్‌ రాజకీయాలు, సవాళ్లు నడిచాయి. అధికార పార్టీ నుండి మంత్రి హరీష్‌ రావు అన్ని తానై నడిపించడంతో… కాంగ్రెస్‌ నాయకులు అంతా… హరీష్‌ రావు టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మొత్తంగా ప్రచారం హాట్‌హాట్‌గా సాగడంతో ఇప్పుడు ఇక పోలింగ్‌పై స్థానికనేతలు దృష్టి సారించారు. గెలుపు ఎవర్నది ప్రజలు నిర్ణయించ నున్నారు.