హెచ్‌-1బీ వీసా మోసం కేసులో ఎన్‌ఆర్‌ఐ

అరెస్ట్‌ చేసి పూచీకత్తుపై విడుదల

వాషింగ్టన్నవంబర్‌3(జ‌నంసాక్షి): హెచ్‌-1బీ వీసా మోసం కేసులో అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతి వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. 46 ఏళ్ల కిశోర్‌ కుమార్‌ కావూరు అనే వ్యక్తిని అక్కడి కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. తర్వాత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కిశోర్‌ కుమార్‌ 2007 నుంచి నాలుగు కన్సల్టింగ్‌ కంపెనీలకు సీఈఓగా పనిచేస్తున్నారు. అతడు పలు కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను నియమించే అంశంలో వీసా మోసాలు, మెయిల్‌ మోసాలు చేసినట్లు అధికారులు అభియోగాలు నమోదు చేశారు. కిశోర్‌ కుమార్‌ పది వేర్వేరు ఘటనల్లో వీసా మోసాలకు, పలు ఘటనల్లో ఈ మెయిల్‌ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పలు సందర్భాల్లో ఆయన లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు, ¬ంల్యాండ్‌ సెక్యురిటీ విభాగానికి విదేశీ ఉద్యోగుల నియామకాలపై బోగస్‌ వర్క్‌ ప్రాజెక్టుల వివరాలు పంపించారని ఆరోపణలు చేశారు. వీసా మోసం కేసులో దోషిగా తేలితే కిశోర్‌కు పదేళ్ల జైలు శిక్ష, అత్యధికంగా 2,50,000డాలర్ల జరిమానా పడుతుంది. ఈమెయిల్‌ మోసంలో దోషిగా తేలితే 20ఏళ్ల జైలు శిక్ష పడనుంది.