హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం

హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వానలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలులకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. రేకుల ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కుండపోతగా వర్షం కురిసింది. అక్కడక్కడ రాళ్లు పడ్డాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉమామహేశ్వరంలో పలు చెట్లు నేలకూలాయి. కొండనాగులలో పిడుగుపడి ఆవు మృతి చెందింది. ఇన్ని రోజులు ఎండలతో సతమతమైన ప్రజలు కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందారు.