హైదరాబాద్‌లో పెరుగుతున్న నిర్మాణ రంగం

క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో కవిత
హైదరాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): నిర్మాణ రంగం రోజురోజుకూ అభివృద్ది చెందుతోందని, దీంతో కార్మికులకు కూడా ఉపాధి పెరుగుతోందని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత అన్నారు. కార్మికులకు ఉపాధి కల్పించడంలో నిర్మాణ రంగది కీలక పాత్ర అని అన్నారు.  మాదాపూర్‌ హైటెక్స్‌లో క్రెడాయి ప్రాపర్టీషోను కవిత  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా గ్లోబల్‌ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. పారిశ్రామిక రంగానికి ఇచ్చినట్లు రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఇన్సెంటీవ్స్‌ ఇవ్వాలి. గత ఐదేళ్లుగా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ గ్రోత్‌ బాగుంది. 368 కిలోవిూటర్ల మేర రాబోయే రీజినల్‌ రింగ్‌ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1500 కోట్లు కేటాయించబోతోంది. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో క్రెడాయి పాల్గొని మొక్కలు పెంచడం అభినందనీయం అన్నారు.  నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు తప్పకుండా బీమా చేయించాలి అని కవిత అన్నారు. ఈ ప్రాపర్టీషో మూడు రోజుల పాటు కొనసాగనుంది.