10 నుంచి చెర్వుగట్టు జాతర

ఏర్పాట్లలో అధికారులు
నల్లగొండ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): చెర్వుగట్టు శ్రీజడల రామలింగేశ్వర స్వామి బ్ర¬్మత్సవాలు 10 నుంచి జరుగనున్నాయి. ఈ నెల 17వరకు నిర్వహిస్తున్నందున వివిధ శాఖలకు కేటాయించిన పనులను చేపట్టాలని కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ అధికారులను ఆదేశించారు. కల్యాణం, అగ్నిగుండం సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో రానున్నందున అధికారులు భక్తులకు సౌకర్యాలపై దృష్టి సారించాలన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇదిలావుంటే  23న జిల్లా కేంద్రంలోని టౌన్‌ హాల్‌లో వివిధ శాఖలు ద్వారా అమలుచేస్తున్న పథకాలపై స్టాల్స్‌ ఏర్పాటు, అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా గ్రాహీణాభివృద్ధి అధికారి సమన్వయం చేస్తారన్నారు. అలాగే
క్రాప్‌ కాలనీల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలనుసరించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ అన్నారు. క్రాప్‌ కాలనీలకు సంబంధించి సమాచారం సేకరించాల్సిఉందని, జిల్లా లో పండించే ప్రధాన పంటలు, ఉద్యాన పంటలు ఎంత దిగుబడి, ఉత్పత్తి ఉంది పంటలు పెంచేందుకు కావల్సిన ప్రణాళిక తయారీకి టీంలు ఏర్పాటు చేయాలన్నారు. రైతువారీగా గ్రామం వారీగా, ఎంత విస్తీర్ణం ఏ పంట పండిస్తున్నారు సర్వే చేయాలన్నారు. వ్యవసాయ శాఖతోపాటు, ఉద్యాన శాఖ, డీఆర్‌డీఏ, పరిశ్రమల శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నా రు. వ్యవసాయాధారిత, చిన్న, వాల్యూఅడేడ్‌ పరిశ్రమలకు స్వయం సహాయ గ్రూపుల ద్వారా చేయుటకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి, పంటలు భద్రపరిచేందుకు కోల్డ్‌స్టోరేజ్‌ ఏర్పాటు తదితర విషయాలపై కూడా శాఖలు దృష్టి పెట్టాలన్నారు.