13న కాంగ్రెస్‌ జాబితా ప్రకటన జిల్లాలో జోరుగా ఊహాగానాలు

సొంతంగా ప్రచారంలో ఉన్న నేతలు
కరీంనగర్‌అక్టోబర్‌9(జ‌నంసాక్షి):  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తొమ్మిదిస్థానాలకు ఈనెల 13 తర్వాత ప్రకటించే జాబితాలో అభ్యర్థులు ఖరారయే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.  ప్రకటించే అవకాశముంది. జగిత్యాల, మంథని, మానకొండూరు, హుస్నాబాద్‌ మినహా మిగతా స్థానాలను సర్వే ఫలితాలతో పాటు కూటమి కేటాయింపుల్లో స్పష్టత ఆధారంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన కాంగ్రెస్‌ అధిష్టానం.. తాజాగా శనివారం ప్రాథమిక పరిశీలన పక్రియను ముగించి టీపీసీసీకి పంపింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న కాంగ్రెస్‌ ఫ్లాష్‌ సర్వే తర్వాతే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇప్పటికే నియోజకవర్గానికి మూడు నుంచి పదిమంది దరఖాస్తు చేసుకోగా.. ఒక్కోస్థానం నుంచి మూడునుంచి ఐదుగురి పేర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో ఉన్న ఆశావహులకు ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ఆదరణ, గుర్తింపు ఉందనే అంశాన్ని తెలుసుకునేందుకు ఈనెల 13లోగా ఫ్లాష్‌ సర్వే నిర్వహించనున్నారు. జగిత్యాల, మంథని, మానకొండూరు, హుస్నాబాద్‌ మినహా మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఈ సర్వే కొనసాగనుంది. మ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 స్థానాలకు బీజేపీ టికెట్‌ కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి, కరీంనగర్‌, రామగుండం, వేములవాడ మినహా మిగతా తొమ్మిది స్థానాలకు ఇద్దరు నుంచి ఐదుగురు వరకు టికెట్లు ఆశిస్తున్నారు. పెద్దపల్లి, కరీంనగర్‌, రామగుండం, వేములవాడ అభ్యర్థులుగా గుజ్జుల రామకృష్ణారెడ్డి, బండి సంజయ్‌, బల్మూరి వనిత, ప్రతాప రామకృష్ణ పేర్లు లాంఛనమే కాగా, మిగిలిన తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ అభ్యర్థుల విషయంలో కూడా ఈనెల 3, 4, 5 తేదీలలో హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేశారు. ఈనెల 10న కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా బహిరంగసభను ఏర్పాటు చేశారు. అమిత్‌షాతోపాటు ఈ సభకు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు హాజరు కానున్నారు. ఈ సభ అనంతరమే అధికారికంగా బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.