140 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు

భారీగా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు

కామారెడ్డి,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో జరుగనున్న రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఆరు మండలాల పరిధిలోని 140 గ్రామ పంచాయతీలకు జరుగనున్న ఎన్నికల కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసారు. గురువారం ఉదయం నుంచి ఆయా మండల కేంద్రాల్లో పోలింగ్‌ సామగ్రిని పోలింగ్‌ అధికారులకు అప్పగించారు. సామగ్రిని తీసుకొని వారికి కేటాయించిన గ్రామాలకు అధికారులు బయలుదేరారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. భోజన విరామం గంట తరువాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆరు మండలాల పరిధిలో 140 గ్రామ సర్పంచులకు జరిగే ఎన్నికల కోసం పోలీసులు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేసారు. మహిళలకు కేటాయించిన సర్పంచ్‌ స్థానాల్లో ఉప సర్పంచ్‌ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంది. చాలా గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థి భర్త వార్డు సభ్యులుగా పోటీ చేయడంతో పాటు ఇతర వార్డు సభ్యులను గెలిపించు కోవడానికి పోటా పోటీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో 8 వార్డులు మాత్రమే ఉండడంతో ఐదు స్థానాలు గెలుచుకుంటే ఉప సర్పంచ్‌ పదవి దక్కుతుందని అంచనాలు వేసుకుంటున్నారు.సర్పంచ్‌ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు ¬రా ¬రీగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుండడంతో బుధవారం సాయంత్రానికి బహిరంగ ప్రచారానికి తెరపడింది.ఎన్నికలకు అవసరమైన శిక్షణను అధికారులు రెండు విడతలుగా ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ పదవులు సగం మహిళలకు కేటాయించడంతో ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్‌ పదివి కీలకంగా మారింది. మహిళా సర్పంచ్‌ పదవి కోసం పోటీ చేస్తున్న గ్రామాల్లో వారి భర్త వార్డు సభ్యులుగా పోటీ చేసి ఉప సర్పంచ్‌ పదవిని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. గ్రామంలో సర్పంచ్‌ పదవి తరువాత కీలకమైన ఉప సర్పంచ్‌ పదవికి చెక్‌ పవర్‌ ఉండడంతో ఈ సారి ఎన్నికల్లో దీనికి ప్రాముఖ్యత పెరిగింది. గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్‌, పిట్లం గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు ప్రచార రథాలు తయారు చేసి మైకులతో ప్రచారం చేశారు. ప్రతి అభ్యర్థి ప్రత్యేకంగా క్యాసెట్లు తయారు చేయించి తాము గ్రామానికి ఏం చేస్తామనే విషయాలను ప్రచారం చేశారు. పంచాయతీకి పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులు ¬రా ¬రీగా ప్రచారం చేశారు. ఇప్పటికే ఇంటింటికీ మద్యం సీసాల పంపిణీ వారం రోజులుగా చేస్తున్న అభ్యర్థులు వాటిని మరింతగా పెంచారు.