162 మంది ఎమ్మెల్యేల మద్ధతు మాకే..

– కాంగ్రెస్‌,ఎన్సీపీ,శివసేన పరేడ్‌

– ఎలాంటి ప్రలోభాలకు లొంగబోమని ఎమ్మెల్యేల ప్రమాణం

ముంబయి,నవంబర్‌ 26(జనంసాక్షి): సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్న మహారాష్ట్ర రాజకీయం గ్రాండ్‌ హయత్‌ ¬టల్‌కు చేరింది. సుప్రీంకోర్టు తీర్పుకు ముందే శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్‌ పార్టీలు తమతో ఉన్న ఎమ్మెల్యేలతో విూడియా ఎదుట పరేడ్‌ నిర్వహించాయి. తద్వారా తమ బలాన్ని బాహ్య ప్రపంచానికి చాటిచెప్పాలనే ప్రయత్నం చేశాయి. తమ మూడు పార్టీలతో పాటు స్వతంత్రులు, చిన్నా చితకా పార్టీలకు చెందిన మొత్తం 162 మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నారని పార్టీలు చెబుతున్నాయి. తాము ఎలాంటి ప్రలోభాలకు లోంగబోమంటూ మూడు పార్టీల నేతలు ప్రమాణం చేయించారు. ఈ పరేడ్‌ను గవర్నర్‌ చూస్తారని భావిస్తున్నట్టు నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. ముంబయిలోని పలు స్టార్‌ ¬టళ్లలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఈ మేరకు ప్రత్యేక బస్సుల్లో గ్రాండ్‌ హయత్‌ వద్దకు చేరుకున్నారు. ”గవర్నర్‌ సాబ్‌.. మా వద్ద 162 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది చూడండి” అంటూ అంతకుముందు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌- ఎన్సీపీ- సేన ‘మహా’ బలప్రదర్శన

¬టల్‌ ఆడిటోరియంలో ఫ్లెక్సీలు

గ్రాండ్‌ హయత్‌ ¬టల్‌లో నేతలు ‘మాతో 162’ మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే సంకేతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో పలు చోట్ల ఈ ఫ్లెక్సీలు ఉంచారు. అలాగే, రాజ్యాంగ ముఖ చిత్రాన్ని కూడా ఓ ఫ్లెక్సీగా ఏర్పాటు చేశారు. ‘మహా వికాస్‌ ఆఘాడి’ వర్థిల్లాలంటూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. దీంతో ¬టల్‌ ప్రాంగణంతా కోలాహలంగా మారింది. ఈ ప్రదర్శనలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అశోక్‌ చవాన్‌, బాలాసాహెబ్‌ థోరాట్‌తో పాటు శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన తనయుడు ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, తదితర నేతలు హాజరయ్యారు.అంతకుముందు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు తమ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఈ పార్టీలు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీకి సమర్పించాయి. తమ 54 మంది ఎమ్మెల్యేలలో 51 మంది సంతకాలను ఎన్సీపీ అందజేయగా.. శివసేన తమ 63 మంది, కాంగ్రెస్‌ 44 మంది సభ్యుల మద్దతు లేఖలను సమర్పించాయి. సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లేఖలు కూడా గవర్నర్‌ కు అందాయి. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో తమకే మెజారిటీ ఉందని ఈ మూడు ప్రధాన పార్టీలు చెప్పుకున్నాయి. 24 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు బీజేపీని ఆదేశించిన నేపథ్యంలో.. సేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ ఎందుకైనా మంచిదని, తమకే మెజారిటీ ఉందంటూ తమ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌ కు సమర్పించడం విశేషం.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా తమకే ఉందని ఈ పార్టీలు పేర్కొంటున్నాయి.