17న వరంగల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సదస్సు

హాజరవుతున్న ఎఐసిసి సభ్యుడు శ్రీనివాస కృష్ణన్‌

వరంగల్‌,జూలై13(జ‌నం సాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ప్రజలు ముందుకు వెళ్లబోతున్నామని డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి అన్నారు. హన్మకొండ లోని పార్టీ కార్యాలయంలో నాయిని రాజేందర్‌ మాట్లాడుతూ శ్రీనివాస్‌ కృష్ణన్‌ ను వరంగల్‌ పార్లమెంట్‌కు ఇంచార్జిగా ఏఐసీసీ నియమించిందని తెలిపారు. ఈ నెల17 న వరంగల్‌ పార్లమెంట్‌ సదస్సు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ కృష్ణన్‌ పాల్గొంటారన్నారు. పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడూ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యకర్తల అనుసంధానానికి రాహుల్‌ గాంధీ శక్తి యాప్‌ ను ప్రారంభించారని తెలిపారు. శక్తి యాప్‌ వల్ల పంజాబ్‌ లో 25 స్థానాలు సాధించామన్నారు. అందుకే తెలంగాణ లో జరగబోయే ఎన్నికల్లో కార్యకర్తల కృషి, శక్తి యాప్‌ దోహదపడుతుందన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు అందరూ ఈ యాప్‌ ను వినియోగించుకోవలన్నారు.

—————–