20నుంచి బస్సుయాత్ర

– శ్రీకాకులం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తాం
– 17రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటన సాగుతుంది
– సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారంకోసం పోరాడతాం
– విలేకరుల సమావేశంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
విశాఖపట్నం, మే17(జ‌నం సాక్షి) : ఉత్తరాంధ్రలో ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాటం ప్రారంభిస్తున్నానని, ఇందులోభాగంగా ఈ నెల 20వ తేదీన ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర చేపడుతున్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. గురువారం విశాఖపట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంగపూజ నిర్వహించి యాత్ర మొదలుపెడతామని, జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పిస్తామని చెప్పారు. మొత్తం 17రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటన ఉంటుందని చెప్పారు. బస్సుయాత్రలో భాగంగా ప్రత్యేక ¬దా ఇవ్వనందుకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో కవాతు నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో లక్షమందితో ఈ కవాతు ఉంటుందని పవన్‌ తెలిపారు. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలేమిటో తెలుసుకోవడానికి యాత్ర చేపడుతున్నామని తెలిపారు. కొంతమంది పాలకుల నిర్లక్ష్యానికి కోట్లాదిమంది ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హావిూలను నెరవేర్చలేదని, ప్రత్యక ¬దాతోపాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలుచేయలేదని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ఇలాగే వెనుకబడి ఉంటే.. ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగుతాయని తెలిపారు. జనసేన పార్టీ మ్యానిఫెస్టో కమిటీ కూడా బస్సుయాత్రలో పాల్గొంటుందని చెప్పారు.
———————————–