2000 రూపాయల పింఛన్లు ఇచ్చి ఒక్కొక్కరింట్లో 9000వేల రూపాయలు గుంజుతుండ్రూ…

ప్రజాగోష – బిజెపి భరోసా యాత్రలో డి.కే.అరుణ….
 గద్వాల ప్రతినిధి నవంబర్ 29 (జనంసాక్షి):-  కరెంటు చార్జీలు,పెంచ్చిండు,బస్ చార్జీలు పెంచ్చిండు, నిత్యవసర సరుకులు,మరియు రిజిస్టేషన్ చార్జీలు,మద్యం ధరలు పెంచి ఇలా అనేక రకాలుగా సామాన్య ప్రజల నడ్డి విరిచాడు…ఇంట్లో ఇద్దరు అర్హులు  ఉన్నా ఒక్కరికే పింఛన్ ఇస్తూన్నాడు…బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది అర్హులు ఉన్నా వారికి పింఛన్ ఇస్తుంది…ప్రజాగోష – బిజెపి భరోసా సందర్భంగా కె టి దొడ్డి మండలం  లో మూడవ  రోజు కొండాపురం ఇర్కిచెడు, ఇర్కిచెడు తాండ పాగుంట, వెంకట పురం ,ముసల్ దొడ్డి ,పలు  గ్రామం లో  బైక్ ర్యాలీ లో పాల్గొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ అంతకుముందు కొండాపురం ఇర్కిచెడు, ఇర్కిచెడు తాండ ,పాగుంట,వెంకట పురం , ముసల్ దొడ్డి ,పలు గ్రామాల్లో  బిజెపి జెండా డికె.అరుణమ్మ  ఆవిష్కరించారు..ఈ సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ..ఖాళీ స్థలం ఉంటే 5లక్షలు ఇస్తా అన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా అని ప్రశ్నించారు..వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరిస్తానని హామీ  ఇచ్చి  తొమ్మిదేళ్లయిన ఇంతవరకు ఎస్టీ జాబితాలో చేర్చడం లేదు..ఫ్రీ ఎరువులు ఇస్తానని చెప్పి5 ఏండ్లు అయ్యింది. ఇచ్చిండా అని ప్రశ్నించారు..రైతుబంధు అయిదు వేలు ఇచ్చి రైతులకు సబ్సిడీ ఇవ్వడం లేదు..రేషన్ బియ్యం లో కేంద్రం వాటా 28 రూపాయలు ఇస్తుంది.. అంతేకాకుండా ఏడాది పైన ప్రతి నెల 5 కిలోలు  ఉచితం గా బియ్యంఇస్తున్నారు..లక్ష కు పైగా పింఛన్లు తీసివేయడం జరిగింది..గతంలో గ్రామాల్లో నేను వేసిన రోడ్లే తప్ప ఇంతవరకు ఒక్క గ్రామంలో తట్టెడు మట్టి వేయలేదన్నారు..