21నుంచి శరన్నవరాత్రి వేడుకలు?

భద్రాచలం,ఆగస్ట్‌30: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఏటా నిర్వహించే ఉత్సవాల్లో బాగంగా ఈ యేడు సెప్టెంబర్లో దసరాకు ముందు ఉత్సవాలను ప్రారంభిస్తారు. శరన్నవరాత్రి మ¬త్సవాలు వచ్చేనెల 21 నుంచి జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే భద్రాద్రిలో ముక్కోటిని కూడా ఘనంగా జరుపుతారు. డిసెంబర్‌ 29న ముక్కోటి వేడుక జరగనుంది. ఈ మేరకు ముక్కోటికి ముహూర్తం ఖరారైందని సమాచారం. ఈ మేరకు వైదిక కమిటీ తేదీలను నిర్ణయించి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిసింది. డిసెంబర్‌19 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయన మ¬త్సవాలు ప్రారంభంకానున్నాయి. డిసెంబర్‌19 నుంచి వైకుంఠ అధ్యయన మ¬త్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్‌19న స్వామివారికి మత్స్యవతారం, 20న కూర్మావతారం, 21న వరాహావతారం, 22న నృసింహావతారం, 23న వామనవతారం, 24న పరశురామవతారం, 25న శ్రీరామవతారం, 26న బలరామవతారం, 27న శ్రీకృష్ణవతారం గావించ నున్నారు. డిసెంబర్‌28న పవిత్ర పావన గౌతమి నదీ తీరంలో సీతారాముల వారికి తెప్పోత్సవం జరపనున్నారు. మరుసటి రోజు డిసెంబర్‌29న ముక్కోటి వేడుక నిర్వహించనున్నారు. దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి ప్రభాకర శ్రీనివాస్‌, స్థానాచార్యులు స్థలసాయి, దేవస్థానం ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథచార్యులు, సీతారామానుజాచార్యులు తదితరులు ముక్కోటి వేడుకలపై సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు హాజరు కానున్నారు.