24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం 

– లక్ష కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేశాం
– రాష్టాన్న్రి అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం
– సంగారెడ్డి అబివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా
– భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు
– అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి
జహీరాబాద్‌, నవంబర్‌18(జ‌నంసాక్షి) : రాష్టాన్న్రి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి 24గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా  జహీరాబాద్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించి అబివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
కోహీర్‌, జహీరాబాద్‌, ఝరాసంగం మండలంలో పర్యటించిన మంత్రి అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం జహీరాబాద్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలో 255 మంది లబ్ధిదారులకు షాదీముబారక్‌ చెక్కులు, కల్యాణలక్ష్మి పథకంలో 326 చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుంచి జహీరాబాద్‌ మండలంలోని బుర్థిపాడు గ్రామం వద్ద వాగు పై కొత్తగా నిర్మించే బ్రిడ్జికి భూమి పూజ నిర్వహించారు. ఝరాసంగంలో రూ.3 కోట్ల వ్యయంతో కాకర్‌వాడ శివారులో నిర్మించిన గోదాంను మంత్రి ప్రారంభించారు.  అదేవిధంగా కోహీర్‌లోని సజ్జాపూర్‌ శివారులో నిర్మించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటి మయం అవుతుందని విభజన సమయంలో అసత్యప్రచారం చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వలేని 24గంటల విద్యుత్‌ను వ్యవసాయానికి అందిస్తున్నామని తెలిపారు. గతంలో విద్యుత్‌ ఇవ్వాలని రోడ్లెక్కి ధర్నా చేశారని, ప్రస్తుతం ఆ పరిస్థితులు తారుమారవుతున్నాయని తెలిపారు. సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ రాష్టాన్న్రి దుర్భరంగా మార్చారన్నారు. ఫలింగా తెలంగాణలోని అధికశాతం జిల్లాలు వెనుకబాటులో ఉండిపోయి ప్రజలు వలసలబాట పట్టారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు పూనుకున్నారన్నారు. తొలుత ప్రాజెక్ట్‌ లపై దృష్టిసారించి అన్ని ప్రాంతాలకు నీరందించేంలా చర్యలు తీసుకున్నారని, తదనంతరం రైతులకు 24గంటల విద్యుత్‌ను అందించి రైతులకు అండగా నిలిచారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అబివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, తద్వారా రాబోయే కాలంలో బంగారు తెలంగాణ సాధనకు బాటలు వేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లాలను అన్ని
రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌ నగరానికి సవిూపంలో ఉన్న ప్రాంతాల అబివృద్ధిపైన పాలకులు దృష్టిసారించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్సీ ఫారురుద్దీన్‌, స్థానిక ఎమ్మెల్యే గీతారెడ్డి, జిల్లా కలెక్టర్‌, అధికారులు పాల్గొన్నారు.