26నుంచి సాధారణ ఓటరు నమోదు

పంచాయితీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు
కలెక్టర్‌ శ్రీదేవసేన
పెద్దపల్లి,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): ఈనెల 26 నుంచి సాధారణ ఎన్నికల కోసం ఓటు నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా అదనపు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు కోసం అధికారులకు క్షేత్రస్థాయిలో తగు సూచనలు అందించాలన్నారు. ఈ నెల 26న డ్రాప్ట్‌ ఓటరు జాబితాను విడుదల ఉంటుందనీ, 26 నుంచి 2019 జనవరి 25 వరకు ఓటరులో జాబితాలో ఉన్న అభ్యంతరాలను, కొత్త దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. 2019 ఫిబ్రవరి 18 వరకు డాటా బేస్‌ అప్‌లోడ్‌ చేస్తామని, 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్నిరాజకీయ పక్షాల నాయకులు సహకరించాలని కోరారు. అలాగే త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల కోసం అవసరమైన అదనపు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన సూచనలు అందించాలని అన్నారు. ఓటరు జాబితా సవరణ, పోలింగ్‌ కేంద్రాల ప్రతిపాదనలు తదితర అంశాలపై ఇప్పటికే  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. 2019లో జరిగే ఎన్నికల కోసం ప్రస్తుతం జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 803 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 28 పోలింగ్‌ కేంద్రాలను మరోచోటకు మార్చేందకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాల పేర్ల మార్పు కోసం కొత్తగా 40 అదనంగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో ఎనిమిదింటిని ఇతర పోలింగ్‌ కేంద్రాల్లో కలపడం జరిగిందన్నారు. రామగుం డం నియోజకవర్గ పరిధిలో 259, మంథని నియోజకవర్గ పరిధిలో 288, పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో 288 లెక్కన పోలింగ్‌ కేంద్రాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇందులో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే రా జకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు అం దజేయాలని కోరారు. జిల్లాలో సాధ్యమైనంత మేరకు పోలింగ్‌ కేంద్రాలను గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉండేలా ఏర్పాటు చేయాలని, వృద్ధులకు, దివ్యాంగులకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు.