27 నుంచి డిగ్రీ పరీక్షలు

నిజామాబాద్‌, మార్చి 2 (జ‌నంసాక్షి) :మార్చి 27 నుంచి తెలంగాణ యూనివర్సిటీ అండర్‌ గ్రాడ్యూయేట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ నసీమ్‌ విడుదల చేశారు.  పరీక్షల సమయాన్ని, తేదీలను సంబంధిత కళాశాలలకు పంపించామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు వారి వారి కళాశాలల్లో సంప్రదించాలని వివరించారు.