4న బహిరంగ సభకోసం ఏర్పాట్లు

సభాస్థలిని ఖరారు చేసేందుకు పరిశీలన
నల్లగొండ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి):  జిల్లాకేంద్రంలో అక్టోబర్‌ 4న నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగసభకు ఏర్పాట్లు మొదలయ్యాయి. సభా స్థలం కోసం విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి నల్లగొండ పట్టణంలో పలు ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు. దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్నారు. భారీగా జనసవిూకరణకు ఇప్పటి నుంచే నేతలను ఆదేశించారు. అక్టోబర్‌ 4న నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరుకానున్న భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేయాలని పార్టీ కూడా నిర్ణయించింది.  అనువైన స్థలం కోసం నల్లగొండ పట్టణంలోని మూడు ప్రాంతాలను సభ నిర్వహణ కోసం పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా, విశాలమైన స్థలాన్ని ఎంపిక చేసి పక్కాగా ఏర్పాట్లు చేపడతామని నేతలు తెలిపారు.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి ప్లలె నుంచీ  సుమారు 3లక్షలకు పైగా సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు హైదరాబాద్‌రోడ్డులోని ఎంఎన్‌ఆర్‌ కన్వన్షన్‌ హాలుతో పాటు ఎస్‌ఎల్‌బీసీ, దేవరకొండరోడ్డులోని హౌజింగ్‌బోర్డు కాలనీలను పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో 3లక్షలకు తగ్గకుండా కార్యకర్తలను సభకు తరలించాలని సూచించారు.