5 కి.మీటర్లు పరుగెత్తిన 9నెలల గర్భిణీ..తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రికార్డు..

కరీంనగర్ : కామారపు లక్ష్మీ అనే తొమ్మిది నెలల గర్భిణీ ఐదు కిలోమీటర్ల మేర పరుగు తీసి రికార్డు సృష్టించింది. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఈ పరుగును 30 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేసింది.