రాణించిన హర్యానా

రెండో రోజు హర్యానాదే ఆధిక్యం
ముంబై ముందు 222 పరుగుల లక్ష్యం
హర్యానా స్కోర్‌ 224/9
మొదటి రోజు 100 పరుగులు చేసిన ముంబై మిగిలిన 36 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. రెండో మ్యాచ్‌ ప్రారంభంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై 136 పరుగులకే అలౌటైంది. ఈ మ్యాచ్‌లో హర్యానా క్రికెటర్‌ మోహిత్‌ శర్మ, పటేల్‌కు చెరో రెండు వికెట్లు పడగా జోగిందర్‌ శర్మ 6 వికెట్లు తీశాడు. దీంతో సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించిన హర్యానా కాస్తా దుకుడుగనే అడడంతో బారీ స్కొర్‌ చేసింది. టాప్‌ ఆర్డర్స్‌ దావన్‌ 44 పరుగులు చేసి దబోల్కర్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. సన్నీ సింగ్‌ మరిసారి రాణించి 110 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఖీద్‌ 45, రానా 19, పటేల్‌ 20 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమాయానికి 68 ఓవర్లు ఆడిన హర్యానా 9 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసి 222 ఆధిక్యంలో ఉంది. జహీర్‌ ఖాన్‌, దబోల్కర్‌లకు చెరో నాలుగు వికెట్లు పడ్డాయి.