తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేస్తోంది :మురళీధర్‌రావు

కరీంనగర్‌,జనవరి24: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందని బీజేపీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చిత్తశుద్ది కనిపించడం లేదన్నారు. బిల్లుపై చర్చతో పాటు పార్లమెంటులో ప్రవేశ పటెట్‌ఏ విషయంలోనూ ద్వంద్వ విధానాలను అవలంబిస్తోందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ టైంటేబుల్‌ మార్చుతూ మోసానికి పాల్పడుతోందన్నారు. ఇకనైనా మోసాన్ని ఆపాలని హెచ్చరించారు. మార్పుకోసం మోడీ-మోడీకోసం మనం అంటూ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. మోడీ నాయకత్వంలో ప్రభుత్వ ఏ ర్పాటు అనంతరం వ్యవసాయ సంక్షోభాన్ని నివా రిస్తూ 24గంటల విద్యుత్‌ సరఫరాతోపాటు దేశవ్యాప్తంగా 24గంటల విద్యుత్‌ సరఫరా లక్ష్యంగా పాలన ఉంటుందన్నారు. మోడీ ధనం సంపాదించిన వ్యక్తికాదని, ఆయన కోసం ప్రతీ ఇంటికి వెళ్లి ఒక నోటు-కమలం విూద ఓటు అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు. మోడీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదు మోడీని ఎదుర్కొనే ధైర్యంలేక కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని బీజేపీ నేత మురళీధర్‌రావు విమర్శించారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రతీ
బూత్‌స్థాయి కమిటీలతో నరేంద్రమోడీ నేరుగా మాట్లాడుతారని తెలిపారు. ఫిబ్రవరి 2న జరిగే దళిత సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధనసేకరణ ఉద్యమరూపం దాల్చబోతుందన్నారు. దేశంలో కాంగ్రెస్‌ ఉంటే కరెంట్‌ ఉండదని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యధికంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో 200సంవత్సరాలకు సరిపడా బొగ్గు గనులున్నాయని, గోదావరి, కష్ణా నదులతో విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. వాజ్‌పేయ్‌ పాలనా కాలంలో రోడ్‌ కనెక్టివిటీ చేస్తే మోడీ కాలంలో రివర్‌ కనెక్టివిటీ చేపడుతామన్నారు. బీజేపీ బలమైన పార్టీగా అవతరించబోతుందన్నారు. దేశం లో ప్రతీ రాష్టాన్రికి ఐఐటీ వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, స్వాతంత్య పోరాటం, చరిత్రను మార్చే అర్హత ఎవరికీలేదన్నారు. జాతీయభావాలు, దేశభక్తి త్రివర్ణ పతాకానికి వ్యతిరేకంగా నిరంకుశంగా నిజాం రాజు వ్యవహరించాడన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వారిని గుర్తిస్తామని, మరణించిన వారిపేరున స్మతి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.