తెలంగాణకు ములాయం ఓకే


భాజపాతో చర్చలు జరుపుతూనే ప్రత్యామ్నాయాలపై కాంగ్రెస్‌ దృష్టి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇన్నాళ్లూ అడ్డంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములా యంసింగ్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్యవర్తిత్వంతో మెత్తబడ్డారు. తెలంగాణ బిల్లు ఎలాగైనా పార్లమెంట్‌ ఆమోదం పొందేలా వ్యూహం పన్నుతున్న కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో సంప్రదింపులు జరుపుతూనే ప్రత్యా మ్నాయాలపైనా దృష్టి సారించింది. ఈమేరకు తెలం గాణకు మద్దతిస్తామన్న రాజకీయ పక్షాలతో పాటు స్తబ్దంగా ఉన్న పార్టీలు, వ్యతిరేకంగా ఉన్న పార్టీలను బిల్లుకు మద్దతిచ్చేలా కాంగ్రెస్‌ చర్చల ద్వారా తనవైప ునకు తిప్పుకుం టోంది. ఈమేరకు ములాయంతో మాట్లాడి తెలం గాణ బిల్లుకు మద్దతిచ్చేలా ఒప్పిం చారు. మరోవైపు బీజేపీతో కాంగ్రెస్‌ పార్టీ రహస్యంగా చర్చలు జరు పుతోంది. 1997లో ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరు తో కాకినాడ తీర్మానం చేసిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడు రాష్ట్రాలు ఇచ్చినా తెలంగాణ ఊసెత్తలేదు. దీంతో ఆ పార్టీ ప్రభ తగ్గిప ోయింది. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టిన తరుణంలో బలపరచకపోతే ఉన్న కాస్త పరువు బజారున పడుతుందని తెలంగా ణకు చెందిన బీజేపీ శ్రేణులు అధినాయకత్వానికి తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయిం చినట్టు తెలిసింది. 2014 ఎన్నికల్లో తాము అధికా రంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ
ఇస్తామన్న హామీని ప్రజలు విశ్వసించాలంటే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వడమే మంచిదని రాజ్‌నాథ్‌సింగ్‌ అభిప్రాయపడినట్లు తెలిసింది. అదే సమయంలో సీమాంధ్ర సమస్యల పరిష్కారం కూడా తమకు ప్రధాన్యతాంశమని బీజేపీ చెప్తోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరించాలని, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలకు పదేళ్లపాటు పన్ను మినహాయింపునివ్వాలని తదితర డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. ఈమేరకు 17న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత 18 లేదా 19 తేదీల్లో లోక్‌సభ ఆమోదం పొందేలా కాంగ్రెస్‌ పార్టీ చేసిన వ్యూహ రచనకు బీజేపీ మద్దతిచ్చినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడం ఇక లాంఛనమే కానుంది.