తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి, మార్చి 15  : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం శనివారం ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు వేలాదిగా తిరుమల కొండకు భక్తులు రావడంతో రద్దీ పెరిగింది. దీంతో సర్వదర్శనానికి వెళ్ళి వేచి ఉండే భక్తుల కంపార్టుమెంట్లు భక్తులతో 20 నిండగా, వీరికి సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు 12గంటల సమయం పడుతున్న భక్తులు తెలిపారు. 300రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శనానికి 6గంటల సమయం పడుతుండగా, కాలిబాటన తిరుమలకు వచ్చే దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు 7గంటల సమయం, 50రూపాయల సుదర్శనం టికెట్లు కలిగిన భక్తులు 4గంటల సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు. కేంద్రీయ విచారణ కార్యాలయంలో వద్ద ఉచిత, 50,100, 500రూపాయల గదులకు భక్తులు రెండు గంటలపైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కల్యాణకట్ట, నిత్యాన్న ప్రసాద సముదాయాల వద్ద భక్తుల రద్దీ కనబడింది. ఆలయం లోపల భక్తులు స్వామివారిని దర్వించుకునేందుకు మహాలఘ దర్శనాన్ని టిటిడి అధికారులు అమలు చేస్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం శుక్రవారం ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు వేలాదిగా తిరుమల కొండకు భక్తులు రావడంతో రద్దీ పెరిగింది. దీంతో సర్వదర్శనానికి వెళ్ళి వేచి ఉండే భక్తుల కంపార్టుమెంట్లు భక్తులతో 22 నిండగా, వీరికి సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకునేందుకు 15గంటల సమయం పడుతున్న భక్తులు తెలిపారు. 300రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శనానికి 6గంటల సమయం పడుతుండగా, కాలిబాటన తిరుమలకు వచ్చే దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు 8గంటల సమయం, 50రూపాయల సుదర్శనం టికెట్లు కలిగిన భక్తులు 4గంటల సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు. కేంద్రీయ విచారణ కార్యాలయంలో వద్ద ఉచిత, 50,100, 500రూపాయల గదులకు భక్తులు రెండు గంటలపైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కల్యాణకట్ట, నిత్యాన్న ప్రసాద సముదాయాల వద్ద భక్తుల రద్దీ కనబడింది. ఆలయం లోపల భక్తులు స్వామివారిని దర్వించుకునేందుకు మహాలఘ దర్శనాన్ని టిటిడి అధికారులు అమలు చేస్తున్నారు. వారాంత సేవలైన శుక్రవారం నాడు స్వామివారికి అభిషేక సేవ నిర్వహించడంతో సర్వదర్శనం భక్తులను 9గంటల అనంతరం స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చారు. కాగా, గురువారం వేకువజామున 3గంటల నుండి అర్థరాత్రి వరకు 52,402మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. శుక్రవారం వేకువజామున 3గంటల నుండి అర్థరాత్రి వరకు 52,402మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు.