‘టీ’ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో

(జ‌నంసాక్షి):తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ను విడుదలచేసింది. కేంద్ర మంత్రి జైరాం రమేష్, టి.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో ముఖ్యాంశాలు
* ప్రతి జిల్లాకు లక్ష ఉద్యోగాలు
* అమరవీరుల కోసం జయశంకర్ ట్రస్ట్ ఏర్పాటు
* వ్యవసాయానికి పగటిపూట 7 గంటల విద్యుత్
* ఆరోగ్య శ్రీ తరహాలో మరింత పారదర్శకంగా ఆరోగ్య విధానం
* సాంకేతిక విద్యార్థులకు ఉపాధి లభించేవిధంగా శిక్షణ
* నల్గొండ, ఖమ్మం సరిహద్దుల్లో వెయ్యి ఎకరాల్లో పారిశ్రామిక జోన్ ఏర్పాటు
* ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా
* బెల్టు షాపులు రద్దు చేస్తాం
* లంబాడా తండాలకు పంచాయితీ హోదా కల్పిస్తాం
* బీసీ యాక్షన్‌ప్లాన్ అమలు
* తెలంగాణలో 8 నుంచి 10 జిల్లాల ఏర్పాటు
* విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు నామమాత్రపు వడ్డీ రుణాలు
* స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు
* జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం.
* వృద్ధులు, వింతతు పెన్షన్‌లు వెయ్యికి పెంపు
* ప్రతి జిల్లాలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు
* వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ కాలేజీలో లెచ్చరర్ పోస్టుల భర్తీ
* ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ పట్టభద్రులు ప్రభుత్వ ఉద్యోగం పొందే వరకు రూ.10 వేల భృతి
* ముస్లిలకు బీసీ ఈ కేటాగిరిలో చేరుస్తాం
* గ్రామాల్లో ఇళ్లులేని వారికి పది సెంట్ల భూమి
* గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు
* మైనార్టీకి సబ్‌ప్లాన్ అమలు చేస్తాం.
* సబ్సీడీ సోలార్ ఆధారిత పంపుసెట్టు అందజేస్తాం.
* సింగరేణిలో వీఆర్ఎస్ పునరుద్దరణ
* సింగరేణిలో ఉద్యోగాలు స్థానికులకే.
* బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ప్రయోట్ చేసేందుకు చర్యలు
* ఒలంపిక్ గేమ్ నిర్వహణే లక్ష్యంగా మౌలిక వసతులు
* పోలిస్‌శాఖలో సంస్కరణలు
* రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ, మేడారం జాతర
* గల్ఫ్ వెళ్లే వారికి భీమా సదుపాయం
* గల్ఫ్‌లో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా
* ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు
* ఉద్యోగులకు ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్
* సకలజనుల సమ్మెలో జీతాలు కోల్పోయిన వారికి చెల్లింపులు