‘సింగరేణి ‘సేవ’ను సద్వినియోగం చేసుకోండి’

ఖమ్మం: సింగరేణి సేవా సమితి, కార్పోరేట్ ఏరియా ఆధ్వర్యంలో బర్మాక్యాంపు ట్రైనింగ్ సెంటర్‌ను కార్పోరేట్ ఏరియా సేవా సమితి కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీ ఆర్వీ.సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి మహిళను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళల కోసం సింగరేణి సేవా సమితి ద్వారా అనేక వృత్తి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా టైలరింగ్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్నదని అన్నారు. క్రమశిక్షణతో టైలరింగ్‌లో మెళకువలను నేర్చుకోవాలని అన్నారు. అలాగే 2014-15 ఆర్ధిక సంవత్సరంలో మరిన్ని కోర్సులు ప్రారంచించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ శిక్షకురాలు మాధవీస్వర్ణలత‌కు గౌరవవేతనాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి కో-ఆర్డినేటర్ శ్రీ అల్లి శంకర్, కమ్యూనికేషన్ సెల్ ఇన్ చార్జ్ శ్రీ కె.వి.రమణ పాల్గొన్నారు.