భద్రకాళి ఆలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు

వరంగల్, మే 8 : జిల్లాలోని చారిత్రక భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారికి చందనోత్సవం చేశారు. మంచిగంధంతో భద్రాకాళీదేవిని అలంకరించారు. ఈ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే ఎలాంటి వ్యాధులు దరిచేరవని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకునేందకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.