వరదనీటి ఉద్ధృతికి దిగువజూరాల జలవిద్యుత్‌ కేంద్రం

హైదరాబాద్‌: జూరాలకు భారీగా వస్తున్న వరదల వల్ల దిగువజూరాల జలవిద్యుత్‌ కేంద్రం నీటమునిగింది. పవర్‌హౌస్‌లోకి భారీగా నీరు చేరడంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకూర్‌ మండల పరిధిలోని గుండాల జలపాతం వద్ద దిగువ జూరాల జలవిద్యుత్‌ కేంద్రం నిర్మితమవుతోంది. ఇప్పటికే ఒక యూనిట్‌ సన్నాహాక పరీక్ష పూర్తికాగా, మరో యూనిట్‌ సన్నాహక పరీక్షకు సిద్దమైంది. విద్యుత్‌ ఉప కేంద్రం వద్ద అధికారులు నీటి ఉద్ధృతిని అంచనా వేయలేక పోవడంతో వరదనీరు ఒక్కసారిగా పవర్‌హౌస్‌లోకి చేరింది. వరదనీరు మళ్లింపు కాలువ ద్వారా వచ్చిన నీరు 4,5,6 యూనిట్లకు ఏర్పాటు చేసిన తాత్కాలిక గేట్లు కొట్టుకుపోయాయి. దీంతో విలువైన యంత్ర సామాగ్రి నీటమునిగింది. పవర్‌హౌస్‌ పూర్తిగా వరదనీటితో నిండిపోవడంతో జెన్‌కోకు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనావేస్తున్నారు. జలవిద్యుత్‌ కేంద్రాన్ని సివిల్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఎలక్గికల్‌ ఎస్‌ఈ శ్రీనివాస పరిశీలించారు.