ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

విశాఖపట్నం: ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. కాలుష్య నివారణశాఖ సీనియర్ అధికారి కోరుకొండ రమేష్ రూ. 70 కోట్ల అక్రమ ఆస్తులతో పట్టబడ్డాడు. తెలంగాణ, ఏపీలోని 10 జిల్లాల్లో ఏకకాలంలో రమేష్, అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. నిందితుడికి పొందూరులో ఆయిల్ ఫ్యాక్టరీ, విశాఖలో 3 ఫ్లాట్లు, 10 ఓపెన్ ఫ్లాట్లు, 10 ఎకరాల భూమి, 4 బ్యాంక్ అకౌంట్లు, 3 లాకర్ల గుర్తించారు. లాకర్లలో భారీగా బంగారం ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.