9న ఆదివాసీ సభకు భారీగా తరలాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): దొడ్డిదారిన గిరిజనతెగలో చేరిన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. ఈనెల 9 హైదరాబాద్‌లో తలపెట్టిన ఆదివాసీల గర్జన సభకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. లంబాఆలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పక్క రాష్టాల్ల్రో లంబాడాలు ఎస్సీ, బీసీ, ఓసీ జాబితాల్లో ఉన్నారని గుర్తు చేశారు. గిరిజనేతరులకు తాము వ్యతిరేకం కాదని, తమ హక్కులను కొల్లగొడుతున్న వారికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడ జీవనం సాగిస్తున్న లంబాడాలపైనే తమ పోరాటమని వివరించారు. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆదివాసీలకు అన్నింటా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. పక్క రాష్టాల్ర నుంచి వలస వచ్చిన వారు కూడా ఎస్టీలుగా మారి ఏజెన్సీలో ధ్రువీకరణ పత్రాలు పొంది ఉద్యోగాలు పొందడంతో పాటు రాజకీయ పదవులు పొందుతున్నారని దుయ్యబట్టారు.