BSNL బొనాంజా: రోజుకు 3 జీబీ డేటా ఫ్రీ

ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ BSNL స‌రికొత్త ప్లాన్స్‌ను ప్ర‌క‌టించింది. రూ.333 నుంచి రూ.395 రేంజ్‌లో ఈ ప్లాన్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఏస్‌గా పిలువ‌బ‌డుతున్న రూ.333 ప్లాన్..రోజుకు 3జీబీ 3జీ డేటాతో పాటు 90 రోజుల పాటు ఉచిత కాలింగ్ ఆఫ‌ర్‌ను కూడా ప్ర‌క‌టించింది. దీంతో జియోతో పాటు ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కూడా గ‌ట్టిపోటీ ఇచ్చిన‌ట్ల‌య్యింది BSNL.

దిల్ కోల్ కే బోల్ ప్లాన్‌
రూ.349తో రీఛార్జ్ చేసుకుంటే  వినియోగ‌దారుల‌కు అప‌రిమిత లోక‌ల్, ఎస్టీడీ కాల్స్ తో పాటు రోజుకు 2జీబీ 3జీ డేటా ఉచితంగా వ‌స్తుంది. రోజుకు 2జీబీ డేటా మించితే స్పీడ్ 80 Kbps కు త‌గ్గుతుంది. BSNL  దిల్ కోల్ కే బోల్ ప్లాన్… రిల‌య‌న్స్ జియో తెచ్చిన‌ ధ‌నాధ‌న్ ప్లాన్‌ను పోలిఉంది.

నెహ్లె పె దెహ్లా ప్లాన్‌
రూ.395 తో రీఛార్జ్ చేసుకుంటే 3వేల నిమిషాల పాటు BSNL నెట్‌వ‌ర్క్‌ల‌కు,1800 నిమిషాలు ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు కాల్ చేసుకునే అవ‌కాశంతో పాటు రోజుకు 2జీబీ డేటా వ‌స్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 71 రోజులు.