ట్రంప్‌ మొట్టమొదటి ఫారెన్‌ టూర్‌

అమెరికా అధ్యక్షుడిగా జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్‌ ట్రంప్‌.. తన మొట్టమొదటి ఫారెన్‌ టూర్‌ ఎక్కడికి వెళతాడన్నది ఆసక్తి రేపింది. రెండునెలల ఉహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. డోనాల్డ్‌ ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్‌.. తొలి విదేశీ పర్యటనగా బెల్జియంకు వెళ్లనున్నారు. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌-నాటో దేశాల … వివరాలు

బ్రిటిష్ పార్లమెంట్ వద్ద ఉగ్రదాడి

లండన్‌: బ్రిటిష్‌ పార్లమెంటు సముదాయం సమీపంలో బుధవారం చోటు చేసుకున్న ఉగ్రదాడిలో ఒక మహిళ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన ప్రవేశద్వారం నుంచి పార్లమెంటులో ప్రవేశించేందుకు గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నిస్తూ, అక్కడి పోలీసు అధికారిపై కత్తితో దాడి చేసి, హతమార్చాడు. మరో అధికారిపైనా దాడి చేయబోతుండగా పోలీసులు కాల్పులు జరిపి ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఇది … వివరాలు

కుప్పకూలిన హెలికాప్టర్.. జాడలేని ప్రయాణికులు

మాస్కో: రష్యాలోని అల్టాయ్ రిపబ్లిక్ ప్రాంతంలో ఓ సివిల్ హెలికాప్టర్ కుప్పకూలడంతో ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి జాడ తెలియరాలేదని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాబిన్‌సన్ 366 రకానికి చెందిన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్.. ఆదివారం రాత్రి టెలెట్ స్కోయ్ సరసు వద్ద కుప్పకూలింది. ‘‘160 మందికి పైగా సిబ్బంది సోమవారం … వివరాలు

పట్టాలు తప్పిన రైలు: నదిలో 22 బోగీలు

కాలిఫోర్నియా: ఓ రైలు పట్టాలు తప్పడంతో, రైలులోని 22 బోగీలు నీటిలో పడిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ రైలులో కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో ప్రాణ హాని తప్పింది. కాలిఫోర్నియాలోని గ్రేటర్ శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో ట్రేసీ సిటి నుంచి స్కార్‌మెంటో మెట్రోపాలిటన్ ప్రాంతంలోని రోజ్‌విల్లేకు ఆహారపదార్థాలను తరలిస్తున్న గూడ్స్ రైలు ఎల్క్‌గ్రోవ్ సిటీకి వచ్చేసరికి … వివరాలు

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

అమెరికాలోని ఓటర్లలో 40% మంది డిమాండ్‌  తాజా పోల్‌లో వెల్లడి ట్రంప్‌కు వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు!  ట్రంప్‌కు దెబ్బ మీద దెబ్బ. ఓ వైపు అధ్యక్షుడికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు. ఏకంగా అభిశంసన ప్రక్రియ ద్వారా ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్లు. మరోవైపు కోర్టుల్లో ట్రంప్‌ సర్కారుకు వరుస ఎదురు దెబ్బలు. ఏడు ముస్లిం దేశాల నుంచి … వివరాలు

ప్రపంచలోనే తొలి సోలార్‌ రోడ్డు

ప్యారిస్‌: ప్రపంచంలోనే తొలిసారిగా సోలార్‌ ప్యానెల్‌రోడ్డు ఫ్రాన్స్‌లో రెడీ అయ్యింది. టైర్‌వ్రే-పేర్ఛేలోని చిన్న గ్రామం నార్మండేలో ఒక కి.మీ పొడువతో ఈ రోడ్డును అక్కడి ప్రభుత్వం సిద్దం చేసింది. ఇందుకోసం 2,880 సోలార్‌ ప్యానెళ్లను ఉపయోగించారు. ఇవి సూర్యశక్తిని విద్యుత్‌ మార్చేస్తాయి.. గ్రామంలోని వీధి దీపాలన్నింటికీ సరిపడా విద్యుత్‌ను ఇవి ఇస్తాయని భావిస్తున్నారు. వీటితో ఏడదిలో … వివరాలు

మెక్సికో మార్కెట్‌లో పేలుళ్లు: 31 మంది మృతి

మెక్సికో సిటీ: నగరంలోని ఒక దుకాణంలో బాణసంచ పేలుళ్లు సంభవించాయి.. పేలుళ్లులోకనీసం 31 మంది మృతిచెందారు.. మరో70 మంది తీవ్రంగా గాయపడ్డారు.. క్షతగాత్రుల్లో పలువురిపరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

92 మంది జల సమాధి

మాస్కో నుంచి సిరియా వెళుతున్న రష్యా సైనిక విమానం నల్లసముద్రంలో కుప్పకూలింది. మృతుల్లో నూతన సంవత్సర వేడుకల్లో కచేరీ జరిపేందుకు బయలుదేరిన కోయర్ గాయకబృందం, కొందరు జర్నలిస్టులు, సైనికులు ఉన్నారు. ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.భారత ప్రధాని నరేంద్రమోదీ విమాన దుర్ఘటనపై సంతాపం తెలిపారు.మాస్కో, డిసెంబర్ 25: సిరియా వెళ్తున్న … వివరాలు

ఐటీ వలలో గుజరాత్ ఫైనాన్షియర్.. 400 కోట్ల ఆస్తులు!

సూరత్, డిసెంబర్ 17: మరో నల్లధనవంతుడి బోషాణం బద్దలైంది! టీ అమ్ముకుంటూ బతికి.. వడ్డీ వ్యాపారిగా ఎదిగిన సూరత్‌లోని ఒక ఫైనాన్షియర్ ఇంట్లో 400 కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలు, రూ.95 లక్షలు విలువచేసే కొత్త 2000 నోట్లు సహా రూ.1.33 కోట్ల నగదు, రూ.7 కోట్ల విలువ చేసే బంగారు నగలు, రూ.72 లక్షల … వివరాలు

ఇరాక్‌ను సద్దాంకే వదిలేయాల్సింది

2003లో ఇరాక్‌పై అమెరికా దండెత్తి ఉండాల్సింది కాదని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నారు. ఇరాక్‌లో అమెరికా చేసిన యుద్ధం, ఆ తర్వాత నెలకొన్న గందరగోళ పరిస్థితులే మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి కారణం. ఇది జాతుల సంఘర్షణకు దారితీసి ఇరాక్‌, సిరియాలను వెంటాడుతున్నదనే భావనతోనే అక్కడి … వివరాలు